Breaking News

నా చీర పిన్ తీసేయమని డైరెక్టర్ అడిగారు: సీనియర్ హీరోయిన్

Published on Sun, 07/09/2023 - 15:27

సీనియర్ నటి, రాజకీయవేత్త హేమమాలిని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పట్లోనే బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో నటించింది. 1960లో సినీ రంగంలో అడుగు పెట్టిన హేమమాలిని తన కెరీర్‌లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత 2004లో భాజపాలో చేరిన ఆమె ప్రస్తుతం మథుర నియోజకవర్గం ఎంపీగా కొనసాగుతున్నారు.  సినిమాల్లో నటిస్తూనే ధర్మంద్రను ప్రేమను వివాహాం చేసుకున్నారామె. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తకర విషయాలను పంచుకున్నారు. 

(ఇది చదవండి: రూ.500కోసం హీరోహీరోయిన్ల వీడియో లీక్‌ చేశారు! )

హేమ మాలిని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉన్నారు. గతంలో ఓ డైరెక్టర్ తన చీరకు ఉన్న పిన్ తీయాలని కోరాడని వెల్లడించింది. ఆ సమయంలో అందరూ షాక్‌కు గురయ్యారు. ఆ రోజుల్లో ఫిల్మ్ మేకింగ్ ఎలా అభివృద్ధి చెందిందో.. అదే ఈ రోజు అత్యంత కష్టతరమైన ప్రక్రియగా మారిందని హేమ ప్రస్తావించారు. తాను మళ్లీ సినిమాల్లో పని చేస్తానని అనుకోవడం లేదన్నారు.

హేమ మాట్లాడుతూ.. 'డైరెక్టర్ ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించాలనుకున్నాడు. నేను ఎప్పుడూ నా చీరపై పిన్‌ను పెట్టుకుంటాను.  నన్ను చీరకు ఉన్న పిన్ తీసేయమని అడిగారు. కానీ నేను మాత్రం చీర కింద పడిపోతుంది అన్నా. మాకు అదే కావాలి అన్నారు.' అని హేమ గుర్తు చేసుకున్నారు. అలాగే 'సత్యం శివం సుందరం' సినిమా ఎప్పటికీ చేయనని తెలిసినా.. రాజ్ కపూర్ తనని ఎలా సంప్రదించాడో కూడా ఆమె వెల్లడించింది. హేమకు ఇద్దరు పిల్లలు ఈషా, అహానా ఉన్నారు. 

(ఇది చదవండి:  'బిగ్ డాడీ' పేరుతో వచ్చేస్తున్న ఘోస్ట్‌ టీజర్‌)

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)