Breaking News

చిరంజీవి సినిమా.. రెమ్యునరేషన్‌ వెల్లడించిన హర్షవర్ధన్‌

Published on Wed, 01/28/2026 - 13:05

అమృతం సీరియల్‌తో బాగా ఫేమస్‌ అయిన వ్యక్తి హర్షవర్ధన్‌. నటుడిగానే కాకుండా డైలాగ్‌ రచయితగానూ సుపరిచితుడైన ఈయన సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. గతేడాది కోర్ట్‌, ఆంధ్ర కింగ్‌ తాలూకా సహా ఐదారు సినిమాల్లో నటుడిగా అలరించిన ఆయన ఈ ఏడాది మన శంకరవరప్రసాద్‌గారు సినిమాలోనూ మెప్పించాడు. 

షూటింగ్‌ మధ్యలో యాక్సిడెంట్‌
అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదలవగా ఏకంగా రూ.350 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో హర్షవర్ధన్‌కు యాక్సిడెంట్‌ కూడా అయింది. దీంతో ఆస్పత్రి బెడ్‌పై నుంచే మిగతా సగం షూటింగ్‌ పూర్తి చేశాడు. తాజాగా ఈ సినిమాకుగానూ తనకు ఎంత పారితోషికం ముట్టిందనే విషయాన్ని బయటపెట్టాడు.

రెమ్యునరేషన్‌ ఎంత?
హర్షవర్దన్‌ మాట్లాడుతూ.. రెమ్యునరేషన్‌ అనేది రెండురకాలుగా ఉంటుంది. ఒకటి సినిమా మొత్తానికి కలిపి ప్యాకేజీ మాట్లాడుకోవడం.. రెండోది రోజుకు ఇంత అని లెక్కగట్టడం. ఈ సినిమాకు 60 రోజులు డేట్స్‌ ఇచ్చాను. రెండు నెలలు కాబట్టి రోజు లెక్కన పారితోషికం ఇవ్వరు. ప్యాకేజీ ఫిక్స్‌ చేశారు. అలా రూ.40 లక్షల రెమ్యునరేషన్‌ తీసుకున్నాను అని పేర్కొన్నాడు. ప్రస్తుతం హర్షవర్దన్‌ చిరంజీవి విశ్వంభర సినిమలో యాక్ట్‌ చేస్తున్నాడు.

చదవండి: ఆ తర్వాత చాలా బాధపడ్డా: విశ్వక్‌సేన్‌

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)