పూరీ-త్రివిక్రమ్ సినిమాలకు 'యానిమల్' కంపోజర్

Published on Thu, 10/09/2025 - 14:03

మొన్నటివరకు తెలుగు సినిమాలకు సంగీతం అంటే అయితే దేవిశ్రీ ప్రసాద్ లేదంటే తమన్ గుర్తొచ్చేవారు. వీళ్ల కాదంటే తమిళం నుంచి అనిరుధ్‌ని తీసుకొచ్చేవారు. స్టార్ హీరోల మూవీస్ అంటే దాదాపు వీళ్లే మెయిన్‌గా కనిపిస్తుంటారు. కానీ ఇప్పుడు వీళ్లతో పాటు కొందరు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ బయటకొస్తున్నారు. అలా వచ్చిన వాళ్లలో హర్షవర్షన్ రామేశ్వర్ ఒకడు.

(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత తొలి సినిమా.. నేరుగా ఓటీటీలో రిలీజ్!)

'అర్జున్ రెడ్డి'కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి కెరీర్ మొదలుపెట్టిన హర్షవర్ధన్.. తర్వాత తెలుగు, తమిళంలోనూ వరస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా తీసిన మూడు సినిమాలకు ఇతడే సంగీతమందించడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడు. రీసెంట్‌గానే 'యానిమల్' చిత్రానికిగానూ జాతీయ అవార్డ్ కూడా అందుకున్నాడు. రీసెంట్ టైంలో అయితే ఇతడి నుంచి పెద్ద చిత్రాలేం రాలేదు.

కానీ ఇప్పుడు పూరీ జగన్నాథ్-విజయ్ సేతుపతి చిత్రానికి హర్షవర్థన్ సంగీతమందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పూరీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై హైప్ బాగానే ఉంది. హర్షవర్ధన్ మ్యూజిక్ బాగుంటే మాత్రం ఇంకా ప్లస్ అయ్యే ఛాన్సులే ఎక్కువ. అలానే రీసెంట్‌గా షూటింగ్ మొదలైన త్రివిక్రమ్-వెంకటేశ్ లేటెస్ట్ మూవీకి కూడా ఇతడే సంగీతమందిస్తున్నాడట. ప్రస్తుతానికైతే ఇది రూమర్ మాత్రమే. త్వరలోనే అనౌన్స్ చేస్తారేమో. త్రివిక్రమ్ తీసిన గత చిత్రాలకు తమన్ సంగీతమందించాడు. ఈసారి మాత్రం లైన్‌లోకి హర్షవర్ధన్ వచ్చినట్లున్నాడు.

(ఇదీ చదవండి: నాగార్జునతో టబు.. మళ్లీ ఇన్నేళ్లకు జంటగా!)

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)