Breaking News

అపస్మారక స్థితిలో 'హరిహర వీరమల్లు' నిర్మాత.. నిజమేంటి?

Published on Fri, 05/30/2025 - 13:16

పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా.. ఎట్టకేలకు మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు పాటలు రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా త్వరలో టీమ్ అంతా మీడియా ముందుకొస్తుంది. మూవీ కోసం అభిమానులు కూడా మరీ కాకపోయినా కొంత ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతలోనే చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే మాటలు వినిపించాయి. దీనిపై ఆయన టీమ్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)

దాదాపు రెండు దశాబ్దాలుగా పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తున్న ఏఎమ్ రత్నం.. పవన్‌తో 'హరిహర వీరమల్లు' తీశారు. దాదాపు ఐదేళ్లుగా సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం.. ఇబ్బందులు దాటుకుని ఈ జూన్ 12న థియేటర్లలోకి రానుంది. సరే ఇదంతా పక్కనబెడితే ఈ చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం.. శుక్రవారం ఉదయం బీపీ ఎక్కువ కావడంతో కళ్లు తిరిగి కింద పడ్డారని, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని తొలుత కొన్ని వార్తలొచ్చాయి. దీంతో హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోనూ చేర్పించారని, ప్రస్తుతం ఆయనకు డాక్టర్స్ చికిత్స అందిస్తున్నారని వినిపించింది.

అయితే ఇవన్నీ కూడా కేవలం పుకార్లేనని, ఏఎమ్ రత్నం ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. మరో నిర్మాత ఏ.దయాకర్ కూడా ఈ విషయమై ట్వీట్ చేశారు. అన్నయ్య ఏఎమ్ రత్నం అనారోగ్యం గురించి వస్తున్న రూమర్స్ నిజం కాదని, ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని, ఇలాంటి పుకార్లని వ్యాపింపజేయొద్దని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

(ఇదీ చదవండి: NIA అదుపులో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌)

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)