Breaking News

ఓటీటీలోకి 'హనుమాన్'.. ప్లాన్‌లో మార్పు.. వచ్చేది అప్పుడేనా?

Published on Mon, 01/29/2024 - 15:41

'హనుమాన్' సినిమా రచ్చ బాక్సాఫీస్ దగ్గర ఇంకా కొనసాగుతూనే ఉంది. సంక్రాంతికి పెద్దగా అంచనాల్లేకుండా రిలీజైన ఈ చిత్రం.. సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికే రూ.250 కోట్ల మేర కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా.. మూడోవారంలోనూ థియేటర్లలో ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తోంది. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. అదలా ఉండగా ఇప్పుడు 'హనుమాన్' ఓటీటీ రిలీజ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)

చైల్డ్ ఆర్టిస్టుగా చాలా ఫేమ్ తెచ్చుకున్న హీరోగా మారిన తేజ సజ్జా.. 'హనుమాన్' మూవీలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియా ప్రేక్షకుల్ని టార్గెట్ చేసుకున్న ఈ చిత్రం.. అన్నిచోట్ల హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రారంభంలో థియేటర్ల సమస్య వచ్చింది గానీ ఇప్పుడు మాత్రం దాదాపు అన్ని చోట్ల సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ విషయంలో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది.

'హనుమాన్' చిత్ర డిజిటల్ హక్కుల్ని జీ5 సంస్థ దక్కించుకుంది. ప్లాన్ ప్రకారం 5-6 వారాల్లోపే ఓటీటీ రిలీజ్ అనుకున్నారు. కానీ సినిమా హిట్ తెచ్చుకోవడంతో పాటు వసూళ్లు ఇంకా వస్తుండటంతో ఓటీటీ స్ట్రీమింగ్‌ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం మార్చి తొలి రెండు వారాల్లో రావొచ్చని అంటున్నారు. దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు పెళ్లయిపోయిందా? భార్య ఎవరంటే?)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)