Breaking News

హన్సికపై విడాకుల రూమర్స్‌.. హీరోయిన్ రియాక్షన్‌ ఇదే!

Published on Thu, 08/21/2025 - 15:58

ఇటీవల హీరోయిన్ హన్సిక మోత్వానిపై వ్యక్తిగత జీవితంపై కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. ఆమె త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ కథనాలు వస్తున్నాయి. ఈ నెల ఆగస్టు 9న తన పుట్టినరోజు సందర్భంగా చేసిన పోస్ట్‌ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. ఈ ఏడాది తనకు చాలా స్పెషల్‌ అని..ఎన్నో పాఠాలు నేర్పిందంటూ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది. కాగా సోహల్‌కు ఇది రెండో పెళ్లి కావడంతో మనస్పర్థలు వచ్చాయని సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైంది. దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

(ఇది చదవండి: విడాకుల బాటలో హన్సిక.. కారణం ఇదేనా?)

తాజాగా హన్సికి మోత్వానీ ఇండోనేషియాలోని బాలిలో చిల్ అవుతూ కనిపించింది. తన ఫ్రెండ్‌తో కలిసి వేకేషన్‌ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన పర్సనల్‌ లైఫ్‌పై వస్తున్న వార్తలు చూసి నవ్వుతూ కనిపించింది. తన వ్యక్తిగత జీవితంపై నెటిజన్స్‌ కామెంట్స్‌ చూస్తూ నవ్వుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. నా జీవితంపై ప్రజల అభిప్రాయాన్ని నేను చదివినప్పుడు అంటూ ఆ వీడియోకు క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ఈ వీడియోతో తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టేసినట్టే కనిపిస్తోంది. అయితే విడాకుల రూమర్స్‌పై ఇప్పటివరకు హన్సిక కానీ, ఆమె భర్త సోహెల్ కూడా స్పందించలేదు. తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి హన్సిక పెళ్లి ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడంతో రూమర్స్ మొదలయ్యాయి.

h

కాగా.. 2022 డిసెంబర్‌లో హన్సిక తన ప్రియుడు సోహైల్‌ని వివాహం చేసుకుంది. సోహల్‌కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఆయనకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకున్నాడు. వీరి వివాహాన్ని ‘లవ్‌ షాదీ డ్రామా’ అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా విడుదల చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)