Breaking News

గోవిందాతో విడాకులు.. అలాంటి వాళ్లు నా ముందుకు రండి: సునీత అహుజా

Published on Sat, 03/01/2025 - 16:30

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో అగ్ర నటుడు గోవింద పేరు తెలియని వారు ఉండరు. ఇటీవల ఆయన పేరు ఎక్కువగా  వినిపిస్తోంది. త్వరలోనే ఆయన తన పెళ్లి బంధానికి గుడ్‌ బై చెప్పనున్నారని బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. దీంతో తనపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు కూడా.  కొద్దిరోజుల కిందట తన ఇంటికి చాలామంది ప్రముఖులు రావడంతో ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఆయన అన్నారు. వారందరూ కూడా కేవలం వ్యాపార విషయాల గురించి మాట్లాడేందుకే వచ్చారని ఆయన తెలిపారు.  తాను కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల వారందరూ వస్తున్నారని చెప్పారు.

అయితే తమపై వస్తున్న విడాకుల వార్తలపై గోవింద భార్య సునీతా అహుజా కూడా స్పందించారు. గోవిందా, తనను ఎవరూ విడదీయలేరని సునీతా అహుజా  తేల్చిచెప్పారు. మేము విడివిడిగా ఉంటున్నా మాట వాస్తవమే.. కానీ గోవింద రాజకీయాల్లోకి ఉండడం వల్లే తాము దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు.. తరచుగా పార్టీకి చెందిన పలువురు మా ఇంటికి వస్తూ ఉంటారు..అందుకే మేము పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉంటున్నామని తెలిపింది.

ఎందుకంటే మేమంతా ఇంట్లో ఉన్నప్పుడు షార్ట్‌లు ధరించి తిరుగుతూ ఉంటాం.. ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది.. అందుకే ఆయన ప్రత్యేకంగా ఆఫీస్‌ కూడా తీసుకున్నారని పేర్కొంది. ఈ ప్రపంచంలో నన్ను, గోవిందాను విడదీయడానికి ఎవరైనా ధైర్యం చేస్తే నా ముందుకు రండి అంటూ నవ్వుతూ మాట్లాడింది సునీత అహుజా. గతంలోనూ తామిద్దరం వేర్వేరు ఇళ్లలోనే నివసిస్తున్నట్లు వెల్లడించింది. మాకు రెండు అపార్ట్‌మెంట్స్ ఉన్నాయని.. ఆయనకు మీటింగ్స్ ఉండటం వల్ల మా ఇంటి ఎదురుగా ఉన్న బంగ్లాలోనే ఉంటారని తెలిపింది. కాగా.. గోవిందా, సునీత 1987లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కుమారుడు యశ్వర్ధన్, కుమార్తె టీనా ఉన్నారు.

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)