Breaking News

థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా

Published on Mon, 05/13/2024 - 15:37

మరో హిట్ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓ పక్క థియేటర్లలో ఇంకా ఆడుతూనే ఉంది. ఇప్పుడు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ.. ఓ విషయం మాత్రం నెటిజన్లకు షాకిస్తోంది. అది చూసి కళ్లు తేలేస్తున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?

'టిల్లు స్క్వేర్' సినిమాతో పాటు మార్చి 29న థియేటర్లలో రిలీజైన హాలీవుడ్ మూవీ 'గాడ్జిల్లా x కాంగ్: ద న్యూ ఎంపైర్'. గాడ్జిల్లా-కాంగ్ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. వచ్చి చాలా రోజులవుతున్నప్పటికీ ఇప్పటికీ చాలా థియేటర్లలో ఆడుతోంది. అలాంటిది ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్)

బుక్ మై షో ఓటీటీలోకి తీసుకొచ్చారు గానీ ఉచితంగా మాత్రం స్ట్రీమింగ్ అందుబాటులో లేదు. ఈ సినిమా రెంట్ విధానంలో 4k క్వాలిటీతో చూడాలంటే రూ.549 చెల్లించాలి. పూర్తిగా కొని చూడాలంటే మాత్రం రూ.799 చెల్లించాలని క్లారిటీ ఇచ్చారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంది.

ఇక బుక్ మై షో ఓటీటీలో సోమవారం అందుబాటులోకి రాగా.. అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్‌లో మంగళవారం నుంచి రెంట్ విధానంలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉండగా రూ.15 కోట్ల డాలర్ల బడ్జెట్ పెట్టగా.. రూ.52.4 కోట్ల డాలర్ల వసూళ్లు ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చాయి. దాదాపు మూడురెట్లు అనమాట.

(ఇదీ చదవండి: స్టేజీపై నటిస్తూ కన్నుమూసిన ప్రముఖ నటుడు)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)