Breaking News

నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?

Published on Fri, 11/14/2025 - 11:47

కొందరు తారలు ఫస్ట్‌ సినిమాకే క్లిక్‌ అవుతుంటారు.. మరికొందరు పెద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొడితే కానీ క్లిక్‌ అవరు. కానీ, మరాఠి నటి గిరిజ ఓక్‌ (Girija Oak Godbole) సోషల్‌ మీడియా వల్ల సడన్‌గా పాపులర్‌ అయిపోయింది. హిందీ, మరాఠి, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ అయిపోయింది. ఎక్కడ చూసినా ఆమె ఇంటర్వ్యూ క్లిప్పింగ్సే కనిపిస్తున్నాయి.

చాలా హ్యాపీ..
ఇలా సడన్‌గా వైరల్‌గా మారడంపై సంతోషం వ్యక్తం చేసింది గిరిజ. అయితే తన ఫోటోలు మార్ఫింగ్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది. అందులో గిరిజ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో నాకు వస్తున్న సడన్‌ అటెన్షన్‌ చూసి షాకైపోయాను. చాలామంది నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. గ్యాప్‌ లేకుండా ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. ఈ ప్రేమ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. కొన్ని మీమ్స్‌ చూస్తుంటే భలే సరదాగా ఉన్నాయి. 

నా 12 ఏళ్ల కొడుకుస్తే..
కానీ కొన్ని మీమ్స్‌లో మాత్రం ఏఐ (కృత్రిమ మేధ)ను ఉపయోగించి నా ఫోటోలు మార్ఫింగ్‌ చేస్తున్నారు. అవి చూడటానికి కూడా చాలా అసౌకర్యంగా ఉన్నాయి. ఆ ఎడిటింగ్స్‌ అస్సలు బాగోలేవు. ఏదైనా వైరలయితే చాలు ఇలా ఏవేవో ఇష్టమొచ్చినట్లు ఎడిట్లు చేస్తుంటారు. దీనికి హద్దులు, పరిమితులంటూ ఏవీ ఉండవు. అదే నాకు వచ్చిన పెద్ద సమస్య! నాకు 12 ఏళ్ల కొడుకున్నాడు. ప్రస్తుతానికైతే వాడు సోషల్‌ మీడియా వాడడు. కానీ, రేప్పొద్దున వాడు కూడా ఈ ఆన్‌లైన్‌ ప్రపంచంలో అడుగుపెట్టక మానడు. 

చీప్‌ ట్రిక్స్‌ మానుకోండి
అప్పుడు నా మార్ఫింగ్‌ ఫోటోలు వాడి కంట పడతాయని భయంగా ఉంది. మా అమ్మ అభ్యంతరకర ఫోటోలు సోషల్‌ మీడియాలో ఉన్నాయేంటి? అని వాడు బాధపడతాడన్న ఆలోచనే నన్ను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. వ్యూస్‌ కోసమే మీరిలాంటి అసభ్య ఫోటోలు సృష్టిస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ మానుకోండి. ఒకమ్మాయి ఫోటోలను ఇలా ఎడిట్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. 

అంతకంటే ఏం కావాలి!
అలాంటి ఎడిటింగ్‌ ఫోటోలను చూసి ఆస్వాదించేవారు కూడా ఈ తప్పుడు పనిలో భాగమైనట్లే లెక్క! దయచేసి అలాంటివి ఆపేయండి. ఇదంతా పక్కనపెడితే సడన్‌గా వచ్చిన ఈ పాపులారిటీ వల్ల ఎక్కువమంది జనాలు నా సినిమా, సిరీస్‌లు చూస్తే అంతే చాలు అని వీడియో ముగించింది. గిరిజ ఓక్‌... హిందీలో తారే జమీన్‌ పర్‌, షోర్‌ ఇన్‌ ద సిటీ, జవాన్‌, ద వ్యాక్సిన్‌ వార్‌, ఇన్‌స్పెక్టర్‌ జిండె సినిమాలు చేసింది.

 

 

చదవండి: నా యాక్టింగ్‌పై నాకే డౌట్‌: దుల్కర్‌

Videos

హిందూపురం YSRCP ఆఫీస్ పై దాడి సాకే శైలజానాథ్ వార్నింగ్

Hindupuram: జై బాలయ్య అంటూ.... టీడీపీ నాయకుల దాడి

ఐబొమ్మ వెబ్సైట్లపై కీలక సమాచారం సేకరణ

Hindupur : YSRCP కార్యకర్తలపైనా దాడిచేసిన టీడీపీ నేతలు

టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ కేసులో కీలక పరిణామం

ఆ ముస్లిం దేశాలపై ట్రంప్ యుద్ధం?

బిహార్ ఫలితాలపై కేసీ వేణుగోపాల్ హాట్ కామెంట్స్

ఆస్ట్రేలియా YSRCP NRIలపై లక్ష్మీపార్వతి ప్రశంసలు

బెట్టింగ్ యాప్ కేసులో రానాను విచారిస్తున్న సీఐడీ

విశాఖలో బస్టాండ్ లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి షాక్

Photos

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)

+5

ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)

+5

హైలైఫ్ ఎగ్జిబిషన్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)

+5

ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)