Breaking News

చిరకాల స్నేహితుడిని పెళ్లాడిన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్

Published on Thu, 08/21/2025 - 14:45

ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇండస్ట్రీలోనూ చాలామంది నెలలోనే పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి గియా మానెక్వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'సాత్ నిభాన సాథియా', 'జీనీ ఔర్ జుజు' సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ నటుడు వరుణ్ జైన్ను పెళ్లాడింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.

గియా తన ఇన్స్టాలో రాస్తూ.. "ఆ దేవుడు, మా గురువుల దయతో, మీరు కురిపించిన ప్రేమతో మేము ఈ రోజు వివాహాబంధంలోకి అడుగుపెట్టాము. మేము ఇద్దరు స్నేహితులం.. కానీ ఈ రోజు చేయి చేయి కలిపి హృదయపూర్వకంగా మేము భార్యాభర్తలం అయ్యాం. ఈ రోజును ఇంత ప్రత్యేకంగా చేసిన మా ప్రియమైన వారందరి ప్రేమ, ఆశీర్వాదాలకు మా కృతజ్ఞతలు. ఎల్లప్పుడు నవ్వుతూ మిస్టర్ అండ్ మిసెస్‌గా జీవితాంతం కలిసి ఉండటానికి ఇదే మా మొదటి అడుగు." అంటూ పోస్ట్ చేసింది.

కాగా.. గియా మానెక్, వరుణ్ జైన్జంటగా తేరా మేరా సాత్ రహే సీరియల్లో నటించారు. అప్పుడు సహనటులుగా ఉన్న వీరిద్దరు.. ఇప్పుడు భార్యాభర్తలుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మరోపైపు గియా మానెక్ సీరియల్స్‌కతో పాటు సినిమాల్లోనూ నటించింది. కామ్ చాలు హై, నా గర్కే.. నా ఘాట్కే లాంటి చిత్రాల్లో కనిపించింది.

 

 

Videos

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)