Breaking News

అసలు అన్న అని పిలవను.. రాజీవ్ కనకాల నాకు బావ!

Published on Mon, 02/23/2026 - 13:44

సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన గాయత్రి భార్గవి.. తర్వాత తెలుగులోనూ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. లేటెస్ట్‌గా ఈమె.. 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు' అనే వెబ్ సిరీస్ చేసింది. జీ5 ఓటీటీలో ఇది ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ప్రీమియర్ ఈవెంట్ జరగ్గా, ఇందులో మాట్లాడిన నటి గాయత్రి భార్గవి.. నటుడు రాజీవ్ కనకాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈయనే నాకు తొలి క్రష్ అని అప్పటి సంగతులని గుర్తుచేసుకుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

'ఈ అమ్మాయి టీవీకి పనికొస్తుందని అప్రూవ్ చేసింది రాజీవ్ కనకాల ద్వారానే. నాకు బాగా గుర్తు. ఓసారి రాజీవ్, బెన్నం ఓ బైక్‌పై.. నా కాలేజీకి వచ్చారు. నా ఫొటో, నన్ను చూసి వెళ్లిపోయారు. కట్ చేస్తే కొన్నాళ్లకు ఓ యాడ్‌లో నటించే అవకాశం దక్కింది. అప్పటినుంచి రాజీవ్ నాకు తెలుసు. ఈయనే నాకు ఫస్ట్ క్రష్. మేం దూరదర్శన్ లో రకరకాల ప్రోగ్రామ్స్ చూసిన రాజీవ్.. మా అందరికీ మొదటి క్రష్. అందుకే సుమ అక్క, రాజీవ్ బావగారు అంటాం. అసలు అన్న గిన్న అని మేం పిలవం' అని గాయత్రి భార్గవి చెప్పుకొచ్చింది.

అయితే గాయత్రి భార్గవి చెబుతున్నప్పుడు రాజీవ్ కనకాల తెగ సిగ్గుపడిపోయాడు. పక్కనే ఉన్న ఉదయభానుతో సహా అక్కడున్న వాళ్లందరూ నవ్వేశారు. ఇక సిరీస్ విషయానికొస్తే.. థ్రిల్లర్ కథతో తెరకెక్కించారు. నటి వాసంతిక టైటిల్ రోల్ చేసింది. రాజీవ్ కనకాల.. ఈమెకు తండ్రిగా నటించాడు. కనిపించకుండా పోయిన కూతురిని వెతికేందుకు తండ్రి ఎలాంటి కష్టాలు పడ్డాడు? చివరకు ఏమైందనే కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకప్పటి యాంకర్ ఉదయభాను.. పోలీస్ పాత్ర చేయడం విశేషం.

(ఇదీ చదవండి: నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)