'ఏ మాయ చేశావే నాగచైతన్యతో కాదు.. ఆ స్టార్‌ హీరోతో చేయాలని': డైరెక్టర్

Published on Wed, 07/02/2025 - 18:41

ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. నాగచైతన్య, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ సమంత ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇ‍చ్చింది. ఈ లవ్ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో జెస్సీ పాత్రలో మెరిసింది. 2010లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌  బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా రిలీజై జూలై 18 నాటికి 15 ఏళ్లు పూర్తవుతోంది.  ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డైరెక్టర్‌ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రం గురించి మాట్లాడారు. అయితే మొదటి ఏ మాయ చేశావే చిత్రానికి హీరోగా నాగచైతన్యను అనుకోలేదని తెలిపారు. స్టార్ హీరో మహేశ్‌ బాబుతోనే తీద్దామని ఈ కథను రాసుకున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో క్లైమాక్స్‌లో చిరంజీవి గెస్ట్ రోల్‌గా పెట్టాలని అనుకున్నట్లు గౌతమ్ వాసుదేవ్ తెలిపారు. క్లైమాక్స్ భిన్నంగా ఉండాలని మెగాస్టార్‌తో ప్లాన్‌ చేశానని పేర్కొన్నారు.

కాగా.. జూలై 18న  'ఏమాయ చేసావె' రీ రిలీజ్‌ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.  ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో కూడా విడుదలైంది. అక్కడ 'విన్నైతాండి వరువాయా' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో శింబు, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. కానీ ఈ సినిమా హిందీలో  'ఏక్ థా దీవానా' పేరుతో రీమేక్‌ అయింది. అక్కడ మాత్రం పరాజయం చవి చూసింది.
 

 

Videos

వల్లభనేని వంశీకి అస్వస్థత

వైఎస్ జగన్ @పులివెందుల

బిహార్ ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్

అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాలల జోలికి పోతే అన్యాయం జరుగుతుందట: బండి సంజయ్

Psycho Attack: టెంపుల్ సిటీ తిరుపతిలో దారుణం

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో YSRCP విస్తృతస్థాయి సమావేశం

కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలో బుద్ధి చెప్తారు: YSRCP నేతలు

పాతాళం నుంచి ఆకాశమంత ఎదిగిన ఆకాశ్ దీప్

YSRCP దళిత కార్యకర్తలపై ఎల్లో తాలిబన్లు దాడి

ప్రియురాలిపై దాడి చేసి అనంతరం యువకుడు ఆత్మహత్యాయత్నం

Photos

+5

మరుపురాని మహానేతకు ఘన నివాళి (ఫొటోలు)

+5

వైఎస్సార్‌.. అరుదైన చిత్రమాలిక

+5

ఉల్లి... వెల్లుల్లి.. తల్లి!..అనేక ఆరోగ్య ప్రయోజనాలు (ఫొటోలు)

+5

పులివెందులలో వైఎస్‌ జగన్‌.. పోటెత్తిన అభిమానం

+5

విష్ణు విశాల్- గుత్తా జ్వాలా కుమార్తెకు పేరు పెట్టిన అమిర్ ఖాన్.. ఫోటోలు

+5

హీరోయిన్‌గా మిత్రా శర్మ.. ఎంతందంగా ఉందో! (ఫోటోలు)

+5

మాదాపూర్ లో 'టీటా' బోనాలు (ఫొటోలు)

+5

RK Sagar : ‘ది 100’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

నెల్లూరులో ఘనంగా మొదలైన రొట్టెల పండగ..పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

గూగూడు కుళ్లాయిస్వామి క్షేత్రం భక్తజన సాగరం (ఫొటోలు)