Breaking News

నాకు తల్లవ్వాలని లేదు, ఎవరేమనుకున్నా ఐ డోంట్‌ కేర్‌!

Published on Thu, 11/20/2025 - 16:38

కొందరు పెళ్లయిన వెంటనే పిల్లలు కావాలనుకోరు. ముందుగా కెరీర్‌లో స్థిరపడ్డాకే పిల్లలను ప్లాన్‌ చేసుకుంటారు. కానీ అసలు పిల్లలే వద్దనుకునేవారు చాలా తక్కువమంది. హిందీ బుల్లితెర నటుడు గౌరవ్‌ ఖన్నా (Gaurav Khanna) భార్య ఆకాంక్ష (Akanksha) ఈ కోవలోకే వస్తుంది. గౌరవ్‌ హిందీ బిగ్‌బాస్‌ 19వ సీజన్‌లో పాల్గొన్నాడు.

తల్లవ్వాలన్న ఆశ లేదు
ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ఆకాంక్ష చమోలా హౌస్‌లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా వీరి తొమ్మిదో పెళ్లి రోజును హౌస్‌లో సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో తనకు తల్లవ్వాలన్న ఆశ లేదంది ఆకాంక్ష. ఆ మాట విని గౌరవ్‌ నిశ్చేష్టుడయ్యాడు. అమ్మ అని పిలిపించుకోవాలని నాకెప్పుడూ అనిపించడలేదు. భవిష్యత్తులో కూడా పిల్లల్ని ప్లాన్‌ చేయాలనుకోవడం లేదు. 

చాలా కారణాలు
పిల్లలుంటే బాగుండన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు. ఇలా పిల్లలు వద్దనుకోవడానికి నా దగ్గర చాలా కారణాలున్నాయి. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేయలేదు. ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఏదో వంటకం చేసినంత ఈజీ కాదు. అది పెద్ద బాధ్యత. నేను దానికి న్యాయం చేయలేను అని నా ఫీలింగ్‌. ఇప్పుడే కాదు, ఇకముందు కూడా ఆ బాధ్యత నిర్వర్తించలేను. ప్రస్తుతం నాకు నా కెరీర్‌ ముఖ్యం. నాకు చాలా లక్ష్యాలున్నాయి. 

నా కెరీర్‌ ముఖ్యం
జనాలు నన్ను స్వార్థపరురాలిని అనుకున్నా మరేం పర్లేదు. నాకు నా కెరీర్‌ ముఖ్యం అని చెప్పుకొచ్చింది. అది విన్న గౌరవ్‌.. నీ సమాధానం తనను మరింత భయపెడుతుందన్నాడు. గౌరవ్‌.. సెలబ్రిటీ మాస్టర్‌ చెఫ్‌ ఇండియా రియాలిటీ షో విజేతగా నిలిచాడు. గౌరవ్‌ - ఆకాంక్ష 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

చదవండి: రీతూని నిలదీసిన తల్లి

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)