ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్
Breaking News
ఉత్తరాంధ్ర జానపద పాటలో ఆనంది మాస్ స్టెప్పులు.. చూశారా?
Published on Tue, 03/24/2026 - 13:23
తెలుగమ్మాయి ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గరివిడి లక్ష్మి. గౌరీ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో బుర్రకథలతో ఫేమస్ అయిన గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నల జీలకర్ర మొగ్గ బాగా వైరలయింది. తాజాగా మరో జానపద పాటను వదిలారు.
ఉత్తరాంధ్ర జానపదం
కోసింది కోయగూర దుబ్బో సందమామ.. వాసనకీ సంపంగి మొగ్గ అంటూ పాట మొదలవుతుంది. ఈ జానపద పాటలో ఆనంది మాస్ స్టెప్పులు వేసింది. చరణ్ అర్జున్ సంగీతం అందించగా అనన్య భట్, షకలక శంకర్, గౌరీ నాయుడు జమ్ము ఆలపించారు. ఈ పాటను ఉత్తరాంధ్ర జానపదాల నుంచి సేకరించినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.
ఆనంది కెరీర్
ఆనంది విషయానికి వస్తే.. తెలంగాణలోని వరంగల్ జిల్లా తన స్వస్థలం. ఆమె అసలు పేరు రక్షిత. సినిమాల్లోకి వచ్చాక తన పేరును హాసికగా మార్చుకుంది. అది కలిసిరాకపోయేసరికి ఆనందిగా మారింది. తెలుగులో జాంబిరెడ్డి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, శ్రీదేవి సోడా సెంటర్, ప్రేమంటే, భైరవం సినిమాలు చేసింది. తెలుగులోకన్నా కోలీవుడ్‌లోనే హీరోయిన్‌గా మంచి పేరు, అవకాశాలు తెచ్చుకుంది.
Tags : 1