Breaking News

గేమ్‌ ఛేంజర్‌ టిక్కెట్ల విక్రయం...ఏ రాష్ట్రంలో ఎంతంటే...

Published on Thu, 01/09/2025 - 18:52

చిత్రం విడుదలకు  కేవలం ఇంకా  ఒక రోజు మాత్రమే మిగిలింది.  రిలీజ్‌కు సంబంధించి కౌంట్‌డౌన్‌ ముగియనుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత మరో అద్భుతమైన పాత్రలో తమ ఫేవరెట్‌ స్టార్‌ని చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఏ పెద్ద స్టార్‌ సినిమా విడుదల ముందైనా సర్వసాధారణంగా జరిగేవే. అవన్నీ అలా ఉంచితే... ఇటీవల భారీ చిత్రాల బాక్సాఫీస్‌ కలెక్షన్లు బాగా చర్చకు నోచుకుంటున్నాయి. గత కొంత కాలంగా భారతీయ సినిమాలకు సంబంధించి హిట్స్, ఫ్లాప్స్‌ అన్నీ వసూళ్లతోనే ముడిపడడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తోంది. 

ఈ నేపధ్యంలో గేమ్‌ ఛేంజర్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌  గురించి కూడా సినిమా వర్గాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఈ సినిమాకి భారీగా హైప్‌ వచ్చినప్పటికీ అడ్వాన్స్‌ టిక్కెట్ల విక్రయం ప్రకారం చూస్తే ఆశించిన స్థాయికి చేరుకోలేదనే చెప్పాలి. భారీ సంచలన చిత్రాల దర్శకుడు శంకర్, మెగా పవర్‌ స్టార్‌ ల కలయికే ఓ సెన్సేషన్‌ కావడంతో  ఈ టాలీవుడ్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది, అయితే కనపడుతున్న స్పందన మాత్రం అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఈ సినిమా డైరెక్టరే అని పలువురు భావిస్తున్నారు.

 ఊహించిన దానికన్నా శంకర్‌ ప్రేక్షకుల్లో తన పట్ల ఆదరణ తగ్గించుకున్నాడని  సినీ వర్గాలు అంటున్నాయి. అదే సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోందని అభిప్రాయపడుతున్నాయి. నిజానికి ఒకప్పుడు శంకర్‌ అంటే పెద్ద బ్రాండ్, కానీ ఇటీవల ఈ డిఫరెంట్‌ సినిమాల ఫిల్మ్‌ మేకర్‌ తన క్రేజ్‌ను కోల్పోయాడు. అతని సినిమాలు గత కొంతకాలంగా  దారుణంగా విఫలమవుతున్నాయి ఆయన చివరి సినిమా భారతీయుడు 2 ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో మనం చూశాం.

కలెక్షన్లలో వ్యత్యాసం..చెబుతోంది అదే...
సినిమా విడుదలకు మరో రోజు మిగిలి ఉండగా...గురువారం ఉదయం 10 గంటల నాటికి గేమ్‌ ఛేంజర్‌ 1వ రోజు మన దేశంలో దాదాపు 5 లక్షలకు పైగా టిక్కెట్‌లను విక్రయించిందని సమాచారం. మొత్తంగా  అడ్వాన్స్‌ బుకింగ్‌ విలువ 14.83 కోట్ల గ్రాస్‌ (బ్లాక్‌ చేసిన సీట్లు మినహా)కు చేరింది. ఇప్పటివరకు దాదాపు 8,000 షోలు లిస్ట్‌ చేశారు. తర్వాత వాటి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.

ఆంధ్రలో టాప్‌..తమిళనాడులో డ్రాప్‌...
రాష్ట్రాల వారీగా చూస్తే టిక్కెట్ల విక్రయంలో ఆంధ్రప్రదేశ్‌ భారీ తేడాతో ముందంజలో ఉంది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌ లోనే గేమ్‌ ఛేంజర్‌ మొదటి రోజు అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా 8.72 కోట్ల గ్రాస్‌ టిక్కెట్లను విక్రయించింది. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ 3.06 కోట్లు, కర్ణాటక 1 కోటి ఉన్నాయి. విశేషం ఏమిటంటే తమిళనాట ఇంకా 1 కోటి మార్కును  సైతం ఈ సినిమా టచ్‌ చేయలేదు, విచిత్రంగా తమిళనాడుకు చెందిన టాప్‌ డైరెక్టర్‌ శంకర్‌ సినిమా అయినప్పటికీ అక్కడ ఈ పరిస్థితి ఉండడం  షాకింగ్‌ అనే చెప్పాలి.  శంకర్‌ పట్ల జనాదరణ ఎంతగా తరిగిపోయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

గుంటూరు కారం కన్నా..ఘాటు తక్కువే...
రామ్‌ చరణ్‌ నటించిన సినిమా బుకింగ్స్‌ విలువ గురువారం ముగిసే సరికి 20 కోట్ల మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు, కానీ అప్పటికీ ముందస్తు అంచనాలను ఇది అందుకోవడం లేదనే చెప్పాలి. ఇంత భారీ చిత్రంగా పేర్కొనని మహేష్‌ బాబు  గుంటూరు కారం సినిమాను సైతం  బీట్‌ చేయడంలో ఇది ఖచ్చితంగా విఫలమవుతుంది,  గత సంక్రాంతి సందర్భంగా విడుదలైన గుంటూరు కారం మొదటి రోజు 24.90 కోట్ల గ్రాస్‌ టిక్కెట్లను విక్రయించింది.

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)