Breaking News

గేమ్‌ ఛేంజర్‌కు పని చేయడం ఓ చేదు అనుభవం.. డైరెక్టర్‌పై విమర్శలు!

Published on Mon, 05/26/2025 - 13:23

ఈ ఏడాది రామ్ చరణ్‌ నటించిన గేమ్ ఛేంజర్‌ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా పెద్దగా రాణించలేకపోయింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో అంజలి, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు.

అయితే 'గేమ్ ఛేంజర్' డైరెక్టర్‌ శంకర్‌పై ఎడిటర్‌ షమీర్ మహమ్మద్ విమర్శలు చేశారు. ఆయనతో పని చేయడం నా జీవితంలో చేదు అనుభవమని చెప్పారు. దర్శకుడు శంకర్‌తో కలిసి పనిచేయడం చాలా దారుణంగా అనిపించిందని షమీర్ మహమ్మద్ వెల్లడించారు. నేను చాలా ఉత్సాహంగా అక్కడికి వెళ్తే.. నాకు అక్కడ అంతా భిన్నంగా ఉందని అన్నారు.

ఎడిటర్ షమీర్ మహమ్మద్ మాట్లాడుతూ.. 'గేమ్ ఛేంజర్ కోసం దాదాపు ఒక సంవత్సరం పనిచేశా.  ఆరు నెలల తర్వాత వారితో మరో నెల రోజులు ఉండాల్సి ఉంటుందని నాతో చెప్పారు. నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సినిమా నిడివి 7 గంటల నుంచి 7.30 గంటలు. దానిని మూడున్నర గంటలకు తగ్గించా. ఆ తర్వాత మరో కొత్త ఎడిటర్ వచ్చి దానిని రెండున్నర నుంచి 3 గంటలకు కుదించాడు. డైరెక్టర్ ఎడిటింగ్ కోసం ఒక తేదీని నిర్ణయించేవాడు. కానీ పది రోజుల తర్వాత మాత్రమే వచ్చేవాడు. అదే పద్ధతి చాలా రోజులు కొనసాగింది. దీంతో నేను 300-350 రోజులు చెన్నైలో ఉన్నా. అందుకే ఈ సినిమాను మధ్యలో వదిలేయాల్సి వచ్చింది" అని అన్నారు. కానీ షమీర్ ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఎడిటర్ రూబెన్‌ను తీసుకున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)