Breaking News

సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో కనిపించే స్టార్‌ ఎవరంటే..?

Published on Fri, 02/21/2025 - 12:23

టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ బాస్‌ సౌరవ్‌ గంగూలీ బయోపిక్‌పై ప్రకటన వచ్చేసింది. ఇదే విషయాన్ని తాజాగా గంగూలీ ప్రకటించారు. తన పాత్రలో కనిపించనున్న నటుడు ఎవరో కూడా ఆయన రివీల్‌ చేశారు. అయితే, ఈ బయోపిక్‌ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో అభిమానులు కూడా ఈ మూవీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా గురించి గంగూలీనే స్వయంగా అప్‌డేట్‌ ఇవ్వడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.

టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో  సౌరవ్ గంగూలీ పేరు తప్పక చరిత్రలో ఉంటుంది. ఇండియా తరఫున 113 టెస్టులు, 311 వన్డేలలో రాణించిన ఆయన అన్ని విభాగాల్లో కలిపి 18575 రన్స్ చేశారు. ఆయన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఇప్పుడు వాటిని వెండితెరపై ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని చూపించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ గురించి  మీడియాతో మాట్లాడిన గంగూలీ పలు విషయాలు పంచుకున్నారు. 

ఈ బయోపిక్‌లో బాలీవుడ్  నటుడు రాజ్‌కుమార్ రావ్ నటిస్తున్నట్లు  సౌరవ్ గంగూలీ తెలిపారు. తనకు తెలిసిన సమాచారం ఆయనే తన పాత్రలో నటిస్తున్నారని సౌరవ్‌ చెప్పుకొచ్చారు. కానీ, ఆయన షెడ్యూల్స్‌ బిజీగా ఉండటం వల్ల సరైన తేదీలు ఇంకా సెట్‌ కాలేదన్నారు. దీంతో ఈ సినిమా కోసం మరో ఏడాది పాటు ఆగాల్సి ఉంటుందని గంగూలీ అన్నారు.

రాజ్ కుమార్ రావ్ బాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ బిజీ స్టార్‌గా ఉ‍న్నారు. రీసెంట్‌గా స్త్రీ2 సినిమాతో ఆయన మరింత పాపులర్‌ అయ్యారు. ప్రస్తుతం భూల్ చూక్ మాఫ్, టోస్టర్‌,మాలిక్‌ వంటి చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. గంగూలీ బయోపిక్‌లో ప్రముఖ బెంగాలీ నటుడిని కూడా చిత్ర యూనిట్‌ సంప్రదించారని తెలుస్తుంది. గంగూలీ స్నేహితుడైన ప్రొసేన్‌జిత్‌ ఛటర్జీని బయోపిక్‌లో నటించమని దర్శక, నిర్మాతలు కోరారట. ఇందుకు ప్రొసేన్‌జిత్‌ కూడా ఒప్పుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ప్రొసేన్‌జిత్‌ సైడ్‌ అయిపోయి కొత్తగా రాజ్‌కుమార్‌ రావు తెరపైకి వచ్చాడు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)