Breaking News

'పరాశక్తి' తర్వాత యంగ్‌ హీరోతో సుధ కొంగర చిత్రం

Published on Tue, 01/13/2026 - 07:23

ఆమె చేసిందే తక్కువ చిత్రాలు.., కానీ,   దర్శకురాలు సుధా కొంగర మంచి గుర్తింపు దక్కించుకున్నారు. కెరీర్‌ ప్రారంభించింది తెలుగు చిత్ర పరిశ్రమలో.. ఉన్నత స్థాయికి చేరింది తమిళ పరిశ్రమలో.. ఆంధ్ర అందగాడు చిత్రం ద్వారా 2008లో దర్శకురాలిగా పరిచయం అయిన ఈమె  తరువాత ద్రోహి, ఇరుదు చుట్రు, తెలుగులో గురు , సూర్య హీరోగా ఆకాశం నీ హద్దురా వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. 

తాజాగా శివకార్తికేయన్‌ హీరోగా తెరకెక్కించిన చిత్రం పరాశక్తి. నటుడు రవి మోహన్‌ ప్రతి నాయకుడిగా  అధర్వ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం ద్వారా నటి శ్రీ లీల కథానాయకిగా కోలీవుడ్‌ కు పరిచయం అయ్యారు. సంక్రాంతి సందర్భంగా గత 10వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి హిట్‌ టాక్‌తో ప్రదర్శింపబడుతోంది. దీంతో దసరాలో సుధా కొంగర తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. అందుకు బదులు కూడా సమాజిక మాధ్యమంలో వైరల్‌ అవుతోంది. 

యువ నటుడు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా నటించనున్న చిత్రానికి సుధాకర్‌ దర్శకత్వం వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు  ప్రచారంలో సారాంశం. ఈమె ఇంతకుముందే  నటుడు ధృవ్‌ విక్రమ్‌కు కథను చెప్పినట్లు, అది ఆయనకు నచ్చినట్లు సమాచారం. అయితే చిత్రాల విషయంలో నిదానమే ప్రధానం అని భావించే మహిళా దర్శకురాలు సుధా కొంగర తన నూతన చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అన్నదే ఇప్పుడు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల  బైసన్‌ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నటుడు విక్రమ్‌ తదుపరి నటించే చిత్రం పైన ఆసక్తి నెలకొంది. 

Videos

విభజన హామీలు ముగిశాయనే వాళ్లు ఆంధ్రా ద్రోహులు: చలసాని

Ravi Chandra : లోకేష్ రెడీగా ఉండు.. నీ కాలర్ పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు

చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్..?

Talasani : మా ఆత్మగౌరవంపై దెబ్బ కొడితే చూస్తూ ఊరుకోం

Satish Reddy: కేసులో మాఫీ చేసుకుని సంబరపడకు YSRCP నిన్ను వదిలిపెట్టదు

గ్రీన్ లాండ్ విలీనం కోసం బిల్లు తెచ్చిన అమెరికా

Kannababu : 8 కేసులు ఎత్తేశారు..ED పెట్టిన కేసులో గోల్ మాల్

విజయవాడ హైవేపై లారీ బోల్తా పల్టీ కొట్టిన కట్టెల లోడ్ లారీ

Achanta: ఎమ్మెల్యే సేవలో ఎంపీడీవో.. గుండెపోటు నాటకం?

CCTV Footage: కోనసీమలో కారు బీభత్సం

Photos

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)

+5

ప్రముఖ నటుడికి సన్మానం.. హాజరైన మీనా (ఫోటోలు)

+5

ఒకే ఫ్రేమ్‌లో నమ్రత, లక్ష్మీ ప్రణతి (ఫోటోలు)

+5

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత మరింత కళగా సమంత (ఫోటోలు)

+5

బుల్లితెర నటులు 'ఇంద్రనీల్, మేఘన'ల గృహప్రవేశం (ఫోటోలు)