కొత్త ఇంట్లోకి సతీసమేతంగా 'బుచ్చిబాబు' గృహప్రవేశం

Published on Sun, 11/09/2025 - 10:51

'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి, జాతీయ అవార్డు అందుకున్న బుచ్చిబాబు కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. మొదటి సినిమానే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగులో ఉత్తమ చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కలిసి పాన్‌-ఇండియా ప్రాజెక్ట్‌ 'పెద్ది'ని తెరకెక్కిస్తున్నారు.

కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన బుచ్చిబాబు తాజాగా పిఠాపురంలో కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. శనివారం సతీ సమేతంగా గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు పాల్గొన్నారు. అభిమానులు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. గృహప్రవేశం కార్యక్రమంలో వల్ల గత రాత్రి జరిగిన ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్‌కు బుచ్చిబాబు రాలేకపోయారు. కానీ, ఆయన తెరకెక్కిస్తున్న పెద్ది సినిమా సాంగ్‌ ఈ కార్యక్రమంలో మరోసారి ప్రేక్షకులకు లైవ్‌లో వినిపించారు.

లైఫ్‌ ఇచ్చిన సుకుమార్‌
బుచ్చిబాబు, సుకుమార్‌లది గురు-శిష్యుల బంధమని తెలిసిందే. సుకుమార్‌ కాకినాడలోని ఓ కాలేజీలో మ్యాథ్స్‌ లెక్చరర్‌గా పనిచేశారని తెలిసిందే. అయితే,  అదే కాలేజీలో బుచ్చిబాబు స్టూడెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో సుకుమార్‌ చెప్పే పాఠాలంటే బుచ్చిబాబుకు బాగా ఇష్టం ఉండేది. దీంతో వారిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అయితే, గురువు దర్శకుడిగా మారడంతో తాను కూడా అదే దారిలో అడుగులు వేశారు. అలా ‘ఆర్య 2’ నుంచి సహాయ దర్శకుడిగా బుచ్చిబాబు పరిశ్రమలోకి  ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సుకుమార్‌ తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో, రంగస్థలం,100% లవ్‌ వంటి చిత్రాలకు అసిస్టెంట్‌ దర్శకుడిగా పనిచేశారు.

Videos

సాక్షి సాక్షిగా.. నాగార్జునకు ఇచ్చే వెళ్తా..!

పశువులను చంపి.. పిఠాపురంలో నకిలీ నెయ్యి కలకలం

జోగి రమేష్ త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

న్యాయం అడిగితే కేసులు పెడతారా ? అండగా ఉన్న అందరికీ ధన్యవాదాలు

ఏపీలో ఫ్రీ బస్సు పథకానికి మంగళం?

ఇదీ నా కాలే.. అదీ నా కాలే.. లైవ్ లో ఇచ్చిపడేసిన RGV

జల్సా టైటిల్ కరెక్ట్ గా సరిపోద్ది.. అధికారం ఏపీలో కానీ..

ప్రభుత్వ వైద్యానికి చంద్రగ్రహణం

చేపల వర్షం..ఇదేందయ్యా, ఇది!

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు

Photos

+5

చీరలో కిక్‌ ఇచ్చే ఫోజులతో బిగ్‌బాస్‌ 'అశ్విని శ్రీ ' (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్‌ షో అదరహో (ఫొటోలు)

+5

అను ఇమ్మాన్యుయేల్ 'ద గర్ల్‌ఫ్రెండ్' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో అనన్య సందడే సందడి (ఫొటోలు)

+5

'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి పెళ్లి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోజా, ప్రియ (ఫోటోలు)

+5

వీకెండ్‌ స్పెషల్‌.. హైదరాబాద్‌ సమీపంలోని బెస్ట్‌ పిక్నిక్ స్పాట్‌లు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టీమిండియా టీ20 మ్యాచ్‌లో కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)

+5

ముద్దమందారం అంతా క్యూట్‌గా బ్రిగిడ (ఫొటోలు)