Breaking News

ఆమె పనిచేసేది 8 గంటలే.. ఇంకెక్కడొస్తుంది!: దీపికపై సెటైర్లు

Published on Sat, 09/27/2025 - 11:55

తల్లయ్యాక తనకంటూ కొన్ని హద్దులు గీసుకుంది బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone). రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేయలేనని కరాఖండిగా చెప్తోంది! భారీ బడ్జెట్‌ సినిమాలకు ఇలాంటి కండీషన్లు పెడితే కష్టమని కల్కి 2 నుంచి ఆమెను తప్పించేశారు. దానికంటే ముందు స్పిరిట్‌ నుంచి కూడా దీపికా సైడ్‌ అయిపోయింది. దీంతో అసలు 8 గంటల షిఫ్ట్‌ తప్పా? ఒప్పా? అని ఎవరికి వారు చర్చల్లో మునిగిపోయారు.

8 గంటలే దీపిక పని
అయితే ఈ విషయంపై దీపికాపై ఫన్నీ సెటైర్లు వేసింది బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌, దర్శకురాలు ఫరా ఖాన్‌ (Farah Khan). తన చెఫ్‌ దిలీప్‌తో కలిసి ముంబైలో నటుడు రోహిత్‌ సరఫ్‌ ఇంటికి వెళ్లింది ఫరా. ఈ మేరకు ఓ యూట్యూబ్‌ వ్లాగ్‌ చేసింది. అందులో మొదటిసారి రోహిత్‌ సరఫ్‌ తల్లిని చూపించింది. నా సినిమా కోసం దీపికను ఒప్పించడానికి కూడా ఇంత సమయం పట్టలేదేమో! అంటూ రోహిత్‌ తల్లిని హత్తుకుంది. ఇంతలో ఫరా చెఫ్‌ దిలీప్‌.. దీపిక పదుకొణె మేడమ్‌ మన షోకి ఎప్పుడొస్తారు? అని అడిగాడు. అందుకామె.. దీపిక ఇప్పుడు రోజులో 8 గంటలు మాత్రమే పని చేస్తుంది. మన షోకి వచ్చేంత తీరిక తనకెక్కడిది? అంది. 

సినిమా
ఫరాఖాన్‌ దర్శకత్వంలోనే దీపిక బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్‌ మూవీ ఓం శాంతి ఓం. ఇందులో షారూఖ్‌ హీరోగా నటించాడు. ఫరా, దీపికా, షారూఖ్‌.. ముగ్గురూ కలిసి హ్యాపీ న్యూ ఇయర్‌ (2014) అనే మరో సినిమా చేశారు. ఆమధ్య 'కల్కి' మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొణె.. చివరగా ఫైటర్‌ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం షారూఖ్‌ ఖాన్‌తో కలిసి 'కింగ్‌' మూవీ చేస్తోంది. అలాగే అట్లీ-అల్లు అర్జున్‌ సినిమాలోనూ భాగమైంది. ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌ అనే హాలీవుడ్‌ సినిమా సీక్వెల్‌లోనూ భాగమైనట్లు ప్రచారం జరుగుతోంది.

చదవండి: నా భార్య బ్రష్‌తో పళ్లు తోముకుంటున్నా: షెఫాలీ భర్త

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)