Breaking News

'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రెడీ.. రెండు సీజన్లలో జరిగింది ఇదే

Published on Mon, 11/17/2025 - 18:46

ఓటీటీ ప్రియులకు ఇష్టమైన స్వదేశీ సిరీస్‌ల్లో 'ద ఫ్యామిలీ మ్యాన్'. పేరుకే యాక్షన్ థ్రిల్లర్ జానర్ అయినప్పటికీ ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీని మిక్స్ చేసిన తీశారు. దీంతో ఈ సిరీస్ చాలామందికి ఫేవరెట్ అయిపోయింది. 2019లో తొలి సీజన్ రాగా, 2021లో రెండో సీజన్ ఓటీటీలోకి వచ్చింది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఇన్నాళ్లకు మూడో సీజన్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి రానుంది. (Family Man 3 In Which OTT) ఈ సందర్భంగా తొలి రెండు సీజన్లు ఏం జరిగిందో చూద్దాం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

ముంబైలో భార్య, కూతురు, కొడుకుతో ఉండే శ్రీకాంత్ తివారీ ఓ మధ్య తరగతి వ్యక్తి. ప్రభుత్వం కోసం రహస్యంగా సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఓవైపు ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు. మరోవైపు మధ్య తరగతి జీవితంలో కష్టాలు. తొలి సీజన్‌లో మూసా అనే ఉగ్రవాది వేసిన ప్లాన్ నుంచి ఢిల్లీ ప్రజల్ని ఎలా కాపాడాడు అనేది చూపించారు. రెండో సీజన్‌లో తమిళ రెబల్స్, శ్రీలంకలో ఎల్‌టీటీ అనే పోరాట గ్రూప్ గురించి అదిరిపోయే రేంజులో చూపించారు.

రెండో సీజన్ చివరలోనే ఈసారి కరోనా కోసం చూపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు. అందుకు తగ్గట్లే కొన్నిరోజుల క్రితం వదిలిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సీజన్ అంతా కూడా ఈశాన్య భారతంలో జరగనుంది. ఇప్పటివరకు ఉన్నవాళ్లతో పాటు జైదీప్ అహ్లవత్, నిమ్రత్ కౌర్ కొత్తగా వచ్చి చేరారు. వీళ్లిద్దరూ విలన్స్‌గా చేస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే రెండు సీజన్లలో ఏమేం జరిగిందనేది యూట్యూబ్‪‌లో 5 నిమిషాల వీడియోగా రిలీజ్ చేశారు. 

(ఇదీ చదవండి: 'ఐ బొమ్మ' క్లోజ్.. మరి మిగతా వాటి సంగతి?)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)