Breaking News

రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ మాట అన్నారు: మూవీ ఈవెంట్‌లో హరీశ్ రావు

Published on Mon, 11/18/2024 - 21:32

జబర్దస్త్‌ ఫేమ్‌ రాకింగ్‌ రాకేష్‌ హీరోగా నటించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్‌’ (కేసీఆర్‌). గరుడవేగ అంజి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య కృష్ణన్‌ కథానాయికగా నటించారు. రాకింగ్‌ రాకేష్‌ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..'ముఖ్యమంత్రులు వస్తు ఉంటారు. పోతుంటారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని  సాధించింది మాత్రం ఒకే ఒక్కడు కేసీఆర్. ఆయన పేరు  మీద సినిమా తీయడం సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణను సాధించడమే కాదు అద్భుతంగా 10 సంవత్సరాలు పరిపాలించారు. రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. నేను హైదరాబాద్‌లో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా అని. కేసీఆర్‌ పల్లెలను, హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. మనం చూసే భౌతికమైన అభివృద్దే కాదు. సామాజిక పరంగా సంస్కృతి పరంగా తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఒక దశ దిశను చూపించారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలబడింది అంటే కేసీఆర్ చేసిన కృషి. అధికారంలో ఉన్న పార్టీ వారి మీద సినిమాలు తీస్తారు. కానీ అధికారంలో లేకపోయినా రాకేష్ ప్రేమతో, దమ్ము ధైర్యంతో ఈ సినిమా తీశారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. లంబాడీ వర్గానికి చెందిన ఓ యువకుడి నిజ జీవితం నుంచి స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించారు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)