Breaking News

హీరోయిన్‌గా బుల్లితెర మెగాస్టార్ కూతురు.. సినిమా రెడీ

Published on Thu, 06/18/2026 - 21:09

సతీష్ ఆవాల దర్శకత్వంలో దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్‌గా పరిచయం అవుతున్న సినిమా 'వెంకట్రామయ్య గారి తాలూకా' విడుదలకు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దివిజ సోదరుడు చంద్రహాస్ ఇప్పటికే హీరోగా ఒకటి రెండు సినిమాలు చేశాడు.

(ఇదీ చదవండి: 'వారణాసి' విలన్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్)

ఈ చిత్ర నిర్మాత, ఫోక్ సింగర్ కోమలి మాట్లాడుతూ.. నాకంటూ ఒక  గుర్తింపు తెచ్చుకుని సినిమా రంగం మీద నాకున్న ఇష్టంతో నేను సినిమా తీయాలి అని ఒక  ధ్యేయంతో చాలా ఒడుదుడుకులని  ఎదుర్కొని వెంకట్రామయ్య గారి తాలూకా మూవీని పూర్తి చేసాం. ఈ సినిమా మొదలయినప్పటి నుంచి కంటినిండా నిద్ర కూడా పట్టేది కాదు. అన్ని కష్టాలు ఎదుర్కుని జులైలో మూవీ విడుదల చెయ్యడానికి రెడీ చేస్తున్నాం అని చెప్పింది.

సినిమా విషయానికొస్తే.. అందమైన పల్లెటూరులో వెంకట్రమయ్య అనే పరువు గల కుటుంబంలో జరిగే కథ ఇది. ప్రస్తుతం మనుషుల మధ్య ఉన్న బంధాలు డబ్బుతో ముడిపడ్డాయి. మానవీయ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. తల్లి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కడుపు కట్టుకుని ఎన్నో కష్టాలను భరిస్తూ పిల్లలను ఎంతో అల్లారు ముద్దుగా నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేస్తున్నారు. కానీ తల్లి తల్లిదండ్రుల చివరి దశలో నలుగురు పిల్లలు కలిసి వాళ్ళని పెంచలేకపోతున్నారు. తల్లిదండ్రుల గొప్పతనం తెలియచేసే సినిమా ఇది అని దర్శకుడు సతీష్ ఆవాల చెప్పాడు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 16 సినిమాలు)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)