Breaking News

ఓడినా.. రెమ్యునరేషన్‌లో 'ఇమ్మాన్యుయేల్‌' అదుర్స్‌

Published on Mon, 12/22/2025 - 08:33

బిగ్‌బాస్‌ తెలుగు 9 అసలైన విజేత ఇమ్మాన్యుయేల్‌ అని సోషల్‌మీడియాలో చాలామంది అంటుంటారు. ఈ సీజన్‌లో తను చాలామంది అభిమానాన్ని సంపాదించుకున్నాడని కామెంట్ల రూపంలో అర్థం అవుతుంది. ఈ సీజన్‌‌ ప్రతి ఎపిసోడ్‌లో ఎక్కువ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది ఇమ్మాన్యుయేల్‌నే కావడం విశేషం.. కమెడియన్‌గా అడుగుపెట్టిన తను హీరోగా నిలిచాడని బిగ్‌బాస్‌ కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. తనకు ట్రోఫీ  దక్కలేదు. కానీ, ప్రేక్షకుల గుండెల్లో విజేతగా నిలిచాడు. 

హౌస్‌లో ఉన్నంత వరకు తనకు దగ్గరైన వాళ్లు తప్పు చేసినా సరే.. మంచివైపే నిల్చున్నాడు. తనవారు తప్పు చేస్తే అంతే ధీటుగా నిలదీశాడు.  తనమన బేధం లేకుండా ఆనందాన్ని అందరికీ పంచుతూ ఈ సీజన్‌ ఎంటర్‌టైనర్‌గా నిలవడమే కాకుండా ఆటలో ఒక పోరాట యోధుడిని కూడా చూపించాడు. కానీ, 4వ స్థానంతో సరిపెట్టుకున్న ఇమ్ము అసలైన విజేత అంటూ సోషల్‌మీడియాలో (Social Media) పోస్టులు పెడుతున్నారు.

రెమ్యునరేషన్‌ ఎంత..?
బిగ్‌బాస్‌లో ఇమ్మానుయేల్ (Immanuel) 15 వారాల పాటు కొనసాగారు. తన జర్నీ చివరి వరకు కూడా ప్రేక్షకులను నవ్వించాడు. ఏడిపించాడు.. అలరించాడు. గతంలో కమెడియన్స్‌ చాలామంది బిగ్‌బాస్‌లోకి వచ్చారు. కానీ, ఇమ్ము మాత్రం​ బలమైన మార్క్‌ చూపాడు. అయితే, ఇమ్ము తన రెమ్యునరేషన్‌కు మించి కంటెంట్‌ను ప్రేక్షకులకు ఇచ్చాడు. బిగ్‌బాస్‌ నుంచి వారానికి రూ. 2.6 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది.  అంటే బిగ్‌బాస్‌ నుంచి మొత్తంగా రూ. 40 లక్షల వరకు రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో భరణి, సంజనలు రెమ్యునరేషన్‌లో టాప్‌లో ఉన్నారు.   ఆ తర్వాత ఇమ్ము ఉన్నాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)