Breaking News

ఓవైపు లగ్జరీ కార్ల వివాదం.. కొత్త కారు కొన్న దుల్కర్

Published on Sun, 11/09/2025 - 17:26

సినిమా సెలబ్రిటీలకు కొన్ని విషయాల్లో విపరీతమైన ఇష్టముంటుంది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌కి ఇలానే లగ్జరీ కార్లు అంటే పిచ్చి. ఎంతలా అంటే అన్ని బ్రాండ్స్ కార్స్ ఇప్పటికే ఇంట్లో చాలా ఉన్నాయి. అయినాసరే ఇప్పుడు మరో కొత్త కారుని కొనుగోలు చేశాడు. ఓవైపు లగ్జరీ కార్ల కొనుగోలు విషయమై కస్టమ్స్ వివాదంలో కొన్నాళ్ల క్రితమే చిక్కుకున్నాడు. ఇలాంటి టైంలో దుల్కర్ కొత్త కారు కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది.

అక్రమంగా విదేశాల నుంచి వాహనాలని దిగుమతి చేసుకుంటున్నారనే ఆరోపణలతో కస్టమ్స్ అధికారులు.. కొన్నిరోజుల క్రితం కేరళలో సోదాలు చేపట్టారు. సినిమా హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరుల ఇళ్లలో రైడ్ చేసి 40కి పైగా కార్లని సీజ్ చేశారు. తన కార్లని కస్టమ్స్ స్వాధీనం చేసుకోవడంపై దుల్కర్.. కేరళ హైకోర్టుని ఆశ్రయించగా ఊరట దక్కింది. కొన్ని షరుతులు, కార్ల విలువలో 20 శాతాన్ని బ్యాంక్ గ్యారంటీగా ఇవ్వడంతో కార్లని తిరిగి దుల్కర్‌కి ఇచ్చేశారు.

(ఇదీ చదవండి: 'జటాధర' సినిమాకు నెగిటివ్ టాక్.. కలెక్షన్స్ మాత్రం ఇలా)

సరే ఈ సంగతులన్నీ పక్కనబెడితే తాజాగా దుల్కర్ సల్మాన్.. ల్యాండ్ రోవర్ డిఫెండర్ కంపెనీకి చెందిన 100 ఆక్టా ఎడిషన్ కారుని కొనుగోలు చేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లగ్జరీ కారు ధర రూ.3 కోట్లు పైనే ఉంటుందని సమాచారం. 4.4 లీటర్ల ట్విన్ టర్బో ఇంజిన్ కలిగిన ఈ కారు.. నాలుగు సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఈ కారు కాకుండా దుల్కర్ దగ్గర మెర్సిడెస్ బెంజ్, పోర్షే, ఫెరారీ, వోల్వో లాంటి టాప్ క్లాస్ ఖరీదైన కార్లలోని మోడల్స్ అన్నీ ఉన్నాయి. 80,90లా వింటేజ్ కార్లని కూడా కొనుగోలు చేసి దుల్కర్.. తన కలెక్షన్‌లో పెట్టుకోవడం విశేషం. దుల్కర్ సినిమాల విషయానికొస్తే గతేడాది 'లక్కీ భాస్కర్'తో హిట్ కొట్టిన దుల్కర్.. ఈ మధ్యే నిర్మాతగా 'లోక' మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇతడు హీరోగా నటించి నిర్మించిన 'కాంత'.. ఈ శుక్రవారం(నవంబరు 14) థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: 'గర్ల్‌ఫ్రెండ్' కోసం రష్మిక రెమ్యునరేషన్ ఎంత?)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)