Breaking News

నన్ను చదివించే స్థోమత లేదు, ఇప్పుడు పట్టాతో నిల్చున్నా!

Published on Thu, 12/18/2025 - 14:11

మలయాళ సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఎస్తర్‌...   "దృశ్యం" సినిమాతో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంది. రెండు తెలుగు భాగాల్లోనూ తనే నటించింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ భావోద్వేగానికి లోనైంది.

జోక్‌ అనుకున్నా..
కొన్నేళ్ల క్రితం నేను రైల్లో ప్రయాణిస్తుండగా నాన్న ఫోన్‌ చేశాడు. నేనో వ్యక్తిని కలిశాను.. అతడి కూతురు లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (LSE)లో చదువుతోందట. నువ్వు ఓసారి ఆమెతో మాట్లాడకూడదూ.. ఏదో ఒకరోజు నువ్వు కూడా ఆ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్తావేమో అన్నాడు. ఏంటి నాన్న జోక్‌ చేస్తున్నావా? అన్నాను. 

కలలో కూడా అనుకోలేదు
ఎందుకంటే అక్కడ చదువుకోవడమనేది మామూలు విషయం కాదు. అసలు అక్కడికి వెళ్లి చదవాలని నేను కలలో కూడా అనుకోలేదు. మా నాన్న పిచ్చివాడు.. ఏవేవో అనవసరమైన కలలు కంటున్నాడు అని మనసులోని నవ్వుకున్నాను. కట్‌ చేస్తే.. ఆయన కూతురిగా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ ఎదుట గ్రాడ్యుయేషన్‌ పట్టాతో నిల్చున్నాను. నిజంగా జీవితం ఎంత విచిత్రమైనదో కదా!

అంత స్థోమత ఎక్కడిది?
నాకు లండన్‌లో సీటు వచ్చిందన్న విషయాన్ని మొదట వాళ్లకు చెప్పనేలేదు. ఎందుకంటే అక్కడ చదివించేంత స్థోమత మా వాళ్లకు లేదు. అప్పటికే నా ఇద్దరు సోదరుల కోసం స్టూడెంట్‌ లోన్స్‌ తీశారు. నా దగ్గర ఎలాగో అంత డబ్బు లేదు. ఎలాంటి గ్రాంట్లు, సహాయం లభించినా.. అది సరిపోదు. అందుకే అక్కడ చదువుకోవడం అంటే చాలా ఖరీదైన విషయమే అనిపించింది.

పేరెంట్స్‌ అండగా
కానీ ఇంట్లో వాళ్లు నాకిదెంత ముఖ్యం అనేది మాత్రమే ఆలోచించారు. డబ్బు ఎలాగోలా సమకూరుస్తాం.. నువ్వెళ్లి చదువు పూర్తి చేయు అని చెప్పి పంపారు. అప్పుడప్పుడు మా తల్లిదండ్రులు చేసే పనికి వారిపై కోప్పడతాను. కానీ వాళ్లు మాత్రం పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కొన్నిసార్లు అది నాకు భయంగా ఉంటుంది. అదే సమయంలో ఎంత కష్టం వచ్చినా మన తల్లిదండ్రులు పక్కనే నిలబడ్డందుకు సంతోషంగానూ ఉంటుంది.

అదే అసలు కష్టం
నేను కలలు కనడంతో పాటు వాటిని సాకారం చేసుకునేందుకు దోహదపడ్డ అమ్మానాన్నకు కృతజ్ఞతలు. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు థాంక్యూ సో మచ్‌. గతవారం ఓ ఇంటర్వ్యూలో నేనేమన్నానంటే.. ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో చేరడం ఒక పెద్ద ఫెయిల్యూర్‌ అన్నాను. కానీ అది నిజం కాదు. అసలు అందులో ‍ప్రవేశం పొందడం కష్టమైన పని కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులతో పోటీపడటం.. ముఖ్యంగా మనతో మనం పోటీపడటమే ఎక్కువ కష్టమైన పని. 

చాలా నేర్చుకున్నా..
దీన్ని నేను అధిగమించాను, సాదించాను. అందుకు సంతోషంగా ఉంది. LSE నన్నెంతగానో మార్చేసింది. పరిస్థితులను అర్థం చేసుకోవడం, విషయాలను లోతుగా ఆలోచించడం.. ప్రతిదాన్ని భిన్న కోణాల్లో చూడటం.. ఇలా చాలా నేర్చుకున్నాను అని ఎస్తర్‌ (Esther Anil) రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ కింద పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

 

చదవండి: తొలి మూవీకే చేదు అనుభవం.. డబ్బులివ్వకుండా..: నటి

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?