Breaking News

'మీ అందానికి సీక్రెట్‌ ఏంటని అడిగా'.. డ్రాగన్ హీరో ప్రదీప్‌

Published on Sun, 10/12/2025 - 18:23

డ్రాగన్ మూవీతో సూపర్‌ హిట్‌ తన ఖాతాలో వేసుకున్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. మరో హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. ప్రేమలు బ్యూటీ మమితా బైజు ఈ మూవీలో హీరోయిన్‌గా కనిపించనుంది. వీరిద్దరు జంటగా వస్తోన్న యూత్ ఎంటర్‌టైనర్‌ డ్యూడ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్‌ చేయగా యూత్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమాకు కీర్తీశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. 

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు హీరో ప్రదీప్. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో తన అందానికి సంబంధించిన ఓ సీక్రెట్‌ను పంచుకున్నారు. మొదటిసారి శరత్‌ కుమార్‌ సార్‌ను కలిసినప్పుడు మీ వయస్సు ఎంత సార్ అని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు. దాదాపు 71 ఏళ్ల వయసులోనూ కేవలం 40 ఏళ్ల యువకుడిలా కనిపించారని అన్నారు. ఆయనతో సార్ అసలు మీరు ఏం తింటారు? ఇంత అందంగా, యంగ్‌గా ఫిజిక్‌ ఉండడానికి  కారణమని ఏంటని అడిగినట్లు తెలిపారు. దీనికి నేను రోజు ఉదయాన్నే బీట్‌ రూట్ జ్యూస్‌ తాగుతానని శరత్ సార్ నాతో చెప్పారని వెల్లడించారు. బీట్ రూట్‌ జ్యూస్‌ తాగితే అందంగా తయారు అవుతారేమో అనుకుని రోజు తాగేవాడినని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆరోగ్యపరంగానే కాకుండా.. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని ప్రదీప్ రంగనాథన్ వెల్లడించారు.

కాగా.. డ్యూడ్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబరు 17న థియేటర్లలో విడుదల కానుంది. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)