Breaking News

సెల్ఫీ ఇస్తా.. ఫ్రీగా దోసె వేసిస్తావా?.. చెఫ్‌ ఆన్సర్‌కు ఆశ్చర్యపోయిన నటి

Published on Fri, 02/28/2025 - 12:34

సెలబ్రిటీలు సోషల్‌ మీడియానే కాదు యూట్యూబ్‌నూ నమ్ముకుంటున్నారు. పర్సనల్‌ విషయాలను, ఫన్నీ సంఘటనలను, బాధాకర విషయాలను, కొత్త ప్రాజెక్టులను.. ఇలా ప్రతీది యూట్యూబ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అలా బుల్లితెర నటి అర్చన పూరన్‌ సింగ్‌ (Archana Puran Singh)కు సైతం యూట్యూబ్‌ ఛానల్‌ ఉంది. ఈ మధ్య ఆమె ఓ వీడియో వదిలింది. అందులో తన కుటుంబంతో కలిసి ముంబైలో తమకిష్టమైన దోస హోటల్స్‌ వద్దకు వెళ్దామంది.

ఫ్యామిలీతో ఫుడ్‌ వ్లాగ్‌
అర్చన భర్త పర్మీత్‌.. చిన్నతనంలో జుహు బీచ్‌లో దొరికే దోస తన ఫేవరెట్‌ అన్నాడు. అర్చన శివనగర్‌లోని ఓ హోటల్‌ పేరు చెప్పగా.. కుమారులు ఆర్యమన్‌, ఆయుష్మాన్‌ ఇద్దరూ మిథిబాయి కాలేజ్‌ దగ్గర దొరికే దోస అలాగే అమర్‌ జ్యూస్‌ సెంటర్‌లో దిరకే జ్యూస్‌ అద్భుతంగా ఉంటాయన్నారు. అలా మొదటగా మిథిబాయి కాలేజీ సమీపంలోని దోసల్ని కుటుంబమంతా ట్రై చేసింది. అక్కడ పనిచేసే చెఫ్‌ నేపాలీవాసి. దీంతో అర్చన.. మసాలా దోసలో ఎక్కువ కారం దట్టించకు.. నేను చెప్పింది చేయకపోతే నిన్ను నేపాల్‌ పంపించేస్తా అని సరదాగా వ్యాఖ్యానించింది. 

చివరగా భర్తకు ఇష్టమైన చోట..
తర్వాత కుటుంబమంతా శివ్‌ నగర్‌కు వెళ్లి అక్కడ దోసను తిన్నారు. అనంతరం అమర్‌ జ్యూస్‌ సెంటర్‌లో ఫేమస్‌ స్ట్రాబెర్రీ మిల్క్‌ షేక్‌ తాగారు. చివరగా భర్తకు ఇష్టమైన దోస కోసం జుహు బీచ్‌కు వెళ్లారు. అక్కడ తనకు ఇష్టమైన హోటల్‌ను వెతకడానికి కాస్తంత సమయం పట్టింది. చివరకు అది ఎట్టకేలకు కనిపించడంతో పర్మీత్‌ ఎగిరి గంతేశాడు. వాళ్లు దోసను ఆస్వాదిస్తుంటే అక్కడున్న జనాలు అర్చనతో ఫోటో దిగేందుకు ఎగబడ్డారు. దీంతో ఆమెకు ఓ ఐడియా తట్టింది. 

నా సెల్ఫీ రూ.100 కూడా విలువ చేయదా?
మాకు దోస వేసిచ్చినందుకు బదులుగా నీకు సెల్ఫీ ఇస్తాను అంది. ఆమె ఐడియా అతడికి ఏమాత్రం నచ్చలేదు. తనకు డబ్బులే కావాలన్నాడు. అందుకు షాకైన అర్చన.. నా సెల్ఫీ రూ.100 కూడా విలువ చేయదా? అని అడిగింది. ఆ హోటల్‌ వ్యక్తి.. సెల్ఫీ కావాలి, అలాగే డబ్బు కూడా కావాలన్నాడు. సరే, భయపడకులే.. నేను డబ్బివ్వకుండా ఎక్కడికీ పారిపోను అని చెప్పింది. ఇక అందరికీ ఈ చివరి స్టాల్‌లోని దోసెనే నచ్చింది.

చదవండి: కోట్ల రూపాయల మోసం కేసులో తమన్నా-కాజల్?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)