Breaking News

రొమాంటిక్‌ ప్రేమకథగా వస్తోన్న 'దూరదర్శని'.. సుకుమార్‌ చేతుల మీదుగా సాంగ్ రిలీజ్

Published on Fri, 04/18/2025 - 18:37

సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం దూరదర్శని. కలిపింది ఇద్దరినీ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహిస్తున్నారు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై బి.సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. 1990 నేపథ్యంలో జరిగిన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పుష్ప-2 డైరెక్టర్‌ సుకుమార్‌ చేతుల మీదుగా ఓరోరి మొండివాడా’ అంటూ సాగే బ్యూటిఫుల్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను సింధుజ, శ్రీనివాసన్‌  ఆలపించగా.. సురేష్‌ బనిశెట్టి సాహిత్యం అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ 'ఈ సినిమా హీరో సువిక్షిత్‌ నా రూపం వచ్చేటట్లు  వరిపొలంలో ఫామింగ్‌ చేశాడు. నాకు అప్పట్నుంచి పరిచయం ఉంది. తనకి  సినిమా అంటే ప్యాషన్. సాంగ్‌ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి. ఈ సినిమా అందరికి మంచి విజయం అందించాలి' అన్నారు.

హీరో సువిక్షిత్ మాట్లాడుతూ.. 'నా అభిమాన దర్శకుడు, ఎంతో ఇష్టమైన వ్యక్తి సుకుమార్‌ చేతుల మీదుగా మా సాంగ్‌ ఆవిష్కరణ జరగడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. అందరికి వాళ్ల వాళ్ల ప్రేమకథలు కూడా గుర్తుకొస్తాయి. ఈ లిరికల్‌ వీడియో అందరి హృదయాలకు హత్తుకుంటుంది.1990వ నేపథ్యంలో అందరికి కనెక్ట్ అయ్యే కథ ఇది. ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేసి దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. తప్పకుండా చిత్రాన్ని అందరూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు'అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో భద్రం, కృష్ణా రెడ్డి, కిట్టయ్య, చలపతి రాజు, జెమిని సురేష్‌, జి.భాస్కర్‌, భద్రమ్‌, లావణ్య రెడ్డి, తేజ చిట్టూరు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)