Breaking News

పెద్ద ఫ్యామిలీ నటుడైతే ఇలా అనేవారా?: మౌళి

Published on Wed, 10/21/2026 - 17:17

యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మౌళి.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ సినిమాతో హీరోగా మారి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మరో కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘దొంగ నా కొడుకు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం నవంబర్‌ 13న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మౌళి.. తనపై వస్తున్న ట్రోల్స్‌, విమర్శల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చాలా బాధపడ్డాను
తన ఎదుగుదలను కొందరు తట్టుకోలేకపోతున్నారని ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు మౌళి స్పందించారు. ‘చాలా బాధపడ్డాను. ఓ పెద్ద కుటుంబం నుంచి వచ్చిన నటుడైతే ఇలాగే మాట్లాడేవారా? వీడు ఏం చేయగలడు? అన్నట్లుగా చాలా కామెంట్లు చేశారు. నిజానికి నేను ఏం చేయలేను. నాకు సినిమా అంటే ఇష్టం. అందుకే ఇవన్నీ భరిస్తున్నాను’ అని చెప్పారు.

‘లిటిల్‌ హార్ట్స్‌’ విజయం తర్వాత ఓ ఛానల్‌ కార్యక్రమానికి నన్ను పలిచారు. ఆ సమయంలో ఆరోగ్యం బాగోలేకపోవడంతో రాలేనని చెప్పా. అప్పుడు నీ తర్వాతి సినిమాకు నెగిటివ్‌ ప్రచారం జరిగే అవకాశం ఉందమో చూసుకో అని వాళ్లు హెచ్చరించారు. దీంతో చేసేది ఏమీ లేక ఆ కార్యక్రమానికి కూడా వెళ్లాను. ఎవరేమనుకున్నా నేను మౌనంగానే ఉంటాను. తిడితే పడతాను. ఎందుకంటే నేను ఏం చేయలేను ‍కాబట్టి’ అని మౌళి పేర్కొన్నారు.  ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.

(ఇదీ చదవండి: టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్‌కు కీలక సూచన)

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)