Breaking News

ఎమ్మెల్యేగా గెలిచిన కోట.. రాజకీయాలను ఎందుకు వదిలేశాడో తెలుసా?

Published on Sun, 07/13/2025 - 11:47

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు. చాలా మంది సినిమా రంగం నుంచి వచ్చి ఇప్పుడు రాజకీయంగా మంచి స్థానంలో ఉన్నారు. అలా కోట శ్రీనివాసరావు కూడా సినిమాలతో బీజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చాడు. ఎమ్యెల్యే కూడా అయ్యాడు. కానీ సడెన్గా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు.
(చదవండి: కోట శ్రీనివాసరావు మరణం.. బోరున విలపించిన బాబు మోహన్‌)

అలా రాజకీయాల్లోకి..
కోట శ్రీనివాసరావుకి బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని వాజ్పేయి అంటే చాలా ఇష్టం. అందుకే అప్పట్లో సీనీ నటులు ఎక్కువగా టీడీపీ, కాంగ్రెస్పార్టీల్లో చేరితే.. కోట మాత్రం బీజేపీలో చేరారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ ప్రోత్సాహంతో బీజేపీ తరపున 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కోట ఓటమి చవిచూశాడు. అయినా బీజేపీ నాయకత్వం కోటని కీలక నేతగానే పరిగణించింది. కానీ కొన్నాళ్ల తర్వాత కోటనే రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమయ్యాడు.

(చదవండి: 30 ఏళ్లపాటు కోటను గుర్తుపట్టని భార్య.. కూతురిని రిక్షా గుద్ది, కొడుకేమో.. ఒంటరిగా కన్నీళ్లు!)

అందుకే రాజకీయాలు వదిలేశా: కోట
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కోట ఇక రాజకీయంగానే స్థిరపడతారని, సినిమాలకు దూరమైనట్లేనని అంతా భావించారు. కానీ కోట మాత్రం సినిమాలను వదులుకోలేదు. రాజకీయంగా సేవ చేయాలని తనకు ఉన్నా..అక్కడ పరిస్థితులు నచ్చకపోవడంతో ఇక జీవితంలో రాజకీయాల్లోకి రావద్దని ఫిక్స్అయ్యారట. విషయాన్ని గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా కోట శ్రీనివాసరావే చెప్పారు.

‘1999లో ఎమ్మెల్యేగా చేశాను. అప్పుడు వాతావరణం వేరు. అప్పటి రాజకీయ నాయకుల్లో ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉండేది. మంచి పని చేశాడు అనిపించుకోవాలనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కావాలంటే కోట్లు కావాలి. 20-30 కోట్లు ఖర్చుపెట్టాలి అనే మాటలు వినబడుతున్నాయి. నా ప్రశ్న ఒక్కటే. అంత మొత్తం ఎవరు ఖర్చు పెట్టమన్నారు? అందుకే రాజకీయాలు డబ్బుమయం అవుతున్నాయని గ్రహించే నా తత్వానికి ఇక పడవు అనుకుని రాజకీయాలు వదిలేశానుఅని కోట అన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)