Breaking News

10 వేల కోట్ల ఆస్తులకు మహారాణి.. దివాలా దెబ్బ.. ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా?

Published on Wed, 07/26/2023 - 12:20

హీరోహీరోయిన్లకున్న డిమాండే వేరు! రెండు హిట్లు పడ్డాయంటే చాలు పారితోషికం అమాంతం పెంచేస్తారు. అదే వరుసగా ఫ్లాప్స్‌ వచ్చాయనుకో.. ఆ పారితోషికంలో హెచ్చుతగ్గులు లేకుండా అదే కంటిన్యూ చేస్తారు. సినిమా పీకల్లోతు నష్టాల్లో మునిగినప్పుడు మాత్రమే రెమ్యునరేషన్‌లో కొంత కట్‌ చేస్తారు.. అది కూడా ఎవరో ఒకరిద్దరు మాత్రమే! సినిమా బడ్జెట్‌లో పారితోషికానికే ఎక్కువగా ఖర్చవుతోంది. ఇప్పుడున్న అగ్రతారలంతా ఒక్కో సినిమాతో కోట్లు గడిస్తున్నారు. మూడు నిమిషాల పాటలో కనిపించినా కోటి వెనకేస్తున్నారు. అలాంటిది వారి ఆస్తులు ఎన్ని కోట్లుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

20 ఏళ్ల వయసులో వెండితెరపై ఎంట్రీ
అయితే 30 ఏళ్ల క్రితమే బాలీవుడ్‌కు దూరమైన ఓ నటి వేల కోట్ల సామ్రాజ్యానికి మమారాణిగా మారింది. సినిమాలతో ఎంత సంపాదించిందో కానీ బిలియనీర్‌ను పెళ్లి చేసుకుని అంతకంటే ధనవంతురాలిగా మారిపోయింది. ఆమె మరెవరో కాదు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్‌ అంబానీ భార్య, మాజీ నటి టీనా అంబాని. ఆమె అసలు పేరు టీనా మునిమ్‌. 20 ఏళ్ల వయసులో దేశ్‌ పర్‌దేశ్‌ సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసింది. ఆమెను చూడగానే ఇటు ప్రేక్షకలోకం, అటు సినీలోకం పరవశించిపోయింది. రాజేశ్‌ ఖన్నా, రిషి కపూర్‌, అమల్‌ పాలేకర్ వంటి బాలీవుడ్‌ అగ్రహీరోలతో కలిసి నటించింది. మొదట్లో వరుస విజయాలతో దూకుడు చూపించిన ఆమె 80వ దశాబ్దం మధ్య కాలం నుంచి అపజయాలను మూటగట్టుకుంది.

టీనా కోసం హీరోల మధ్య గొడవ
1987 తర్వాత ఆమె రెండే రెండు సినిమాలు చేసింది. 1991లో వచ్చిన జిగర్వాలా చిత్రంలో చివరిసారిగా కనిపించింది. సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందిన రోజుల్లో టీనా పలువురు హీరోలతో లవ్వాయణం నడిపిందని వార్తలు వచ్చేవి. అందులో రిషి కపూర్‌ పేరు కూడా ఉంది. అయితే అది నిజం కాదని రిషి కపూర్‌ తన ఆత్మకథలో స్పష్టం చేశాడు. ఈ పుకారు నిజమేననుకున్న మరో హీరో సంజయ్‌ దత్‌ తనతో గొడవ పడేందుకు నేరుగా ఇంటికే వచ్చాడని కూడా వెల్లడించాడు. అంటే అప్పట్లో టీనా క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరం
1991 ఫిబ్రవరి 2న ఆమె అగ్ర వ్యాపారవేత్త అనిల్‌ అంబానీని పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె ఆస్తుల విలువ ఒకానొక దశలో రూ.10,000 కోట్లు. ఆమె భర్త అనిల్‌ అంబానీ (42 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో) ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఆరవ వ్యక్తిగా వార్తల్లో నిలిచారు. అయితే వరుసగా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ రావడంతో వీరి సంపాదన కొంత ఆవిరైపోయింది. దీంతో ప్రస్తుతం టీనా ఆస్తి విలువ రూ.2331 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: విమానంలో వెకిలి చేష్టలు.. బొక్కలిరగ్గొట్టిన బ్యూటీ

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)