Breaking News

క్రికెట్ గాడ్ స‌చిన్‌తో ఉన్న ఈ తెలుగు హీరోను గుర్తుప‌ట్టారా?

Published on Sat, 11/04/2023 - 17:28

పై ఫోటోలో ఉన్న పిల్లాడిని గుర్తుప‌ట్టారా? క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ ప్రేమ‌గా ప‌ట్టుకున్న ఆ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోగా రాణిస్తున్నాడు. ఇత‌డు హీరోగా న‌టించిన తొలి సినిమాకే ఉత్త‌మ న‌టుడిగా సైమా అవార్డు సైతం అందుకున్నాడు. శ్రీలీల‌తోనూ ఓ సినిమా చేశాడు. ఇత‌డి తండ్రిటాలీవుడ్‌లో సీనియ‌ర్ న‌టుడు.. ఈపాటికే ఇత‌డెవ‌రో గుర్తుప‌ట్టే ఉంటారు.

తొలి సినిమాతోనే క్రేజ్‌
స‌చిన్ టెండూల్క‌ర్‌తో ఉన్న ఆ పిల్లాడు మ‌రెవ‌రో కాదు.. సీనియ‌ర్ న‌టుడు శ్రీకాంత్ త‌న‌యుడు, యంగ్ హీరో రోష‌న్ మేక‌. శ్రీకాంత్ ఎన్నో అద్భుత సినిమాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. తండ్రిలోని న‌ట‌న‌ను పుణికి పుచ్చుకున్న రోష‌న్ రుద్ర‌మ‌దేవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించాడు. నిర్మ‌ల కాన్వెంట్‌తో హీరోగా మారాడు. ఈ సినిమాకు అద్భుత‌మైన స్పంద‌న ల‌భించింది. ఈ చిత్రం రిలీజైన ఐదేళ్ల త‌ర్వాత పెళ్లి సంద‌D మూవీతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇందులో శ్రీలీల క‌థానాయిక‌గా న‌టించింది.  ఈ సినిమాకు పాజిటివ్ స్పంద‌న ల‌భించింది.

ఇప్పుడేం చేస్తున్నాడు?
ప్ర‌స్తుతం రోష‌న్‌.. వృషభ సినిమా చేస్తున్నాడు. ది వారియ‌ర్ అరైజ్ అనేది ఉప‌శీర్షిక‌. ఇందులో మోహ‌న్‌లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. తండ్రీకొడుకుల మ‌ధ్య సాగే ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ డ్రామాగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. జహ్రా ఖాన్, శనయ కపూర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నంద కిషోర్‌ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ వ్యాస్, విశాల్‌ గుర్నాని, జుహి పరేఖ్‌ మెహతా, శ్యామ్‌ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్‌ మథూర్, సౌరభ్‌ మిశ్రా నిర్మిస్తున్నారు.  తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం హిందీ, కన్నడ, తమిళ భాషల్లో 2024లో రిలీజ్‌ కానుంది.

చ‌ద‌వండి: మంజుల ఇల్లు చూశారా? ఇంటీరియ‌ర్ అదిరింది.. ఏకంగా ఆరు బాల్క‌నీలు..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)