Breaking News

'చాలా అందంగా ఉన్నారు.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు'.. ఛావా నటి ఆన్సర్‌ ఇదే!

Published on Wed, 06/11/2025 - 16:50

30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదా? ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా వినిపిస్తుంటాయి. కెరీర్‌, జాబ్‌ అంటూ వివాహాలు చేసుకోకుండా చాలామంది సింగిల్స్‌గానే బతికేస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో వాళ్లయితే ఏకంగా 40 పదుల వయస్సు దాటినా సింగిల్‌గానే ఉంటున్నారు. అలాంటి సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్, త్రిష, ప్రభాస్ లాంటి అగ్రతారలేందరో ఉన్నారు. అలా సినీ ఇండస్ట్రీలో 40 పదుల వయస్సు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉన్నవారిలో మరో బాలీవుడ్ భామ దివ్య దత్తా ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమన్నారో తెలుసుకుందాం.

దివ్య పెళ్లి బంధం గురించి మాట్లాడుతూ.. “మీరు మంచి భాగస్వామి దొరికితే వివాహం చేసుకోవడం చాలా బాగుంటుంది. అదే పెళ్లి లేకపోతే జీవితం ఇంకా అందంగా సాగుతుంది. అందుకే పెళ్లి చేసుకోవడం  కంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మంచిది. నాపై చాలా మంది పురుషులు శ్రద్ధ పెడుతుంటారు. నేను వాటిని ఆస్వాదిస్తా అంతే. కానీ మీరు కనెక్ట్ అయితేనే రిలేషన్‌లో ఉండాలి. ఆ వ్యక్తి మీ చేయి పట్టుకోగలడని మీరు భావించాలి. ఒకవేళ అది జరగకపోతే నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. నా కోసం నేను ఉన్నా.' అని మాట్లాడింది.

దివ్య దత్తా ఇంకా మాట్లాడుతూ.. "నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. కేవలం ఎవరైనా నాతో ప్రయాణించగల సహచరుడిగా ఉండటానికి ఇష్టపడతా. అది లేకపోయినా నేను ఇప్పటికీ సంతోషంగా ఉన్నా. నా ప్రాణ స్నేహితుడు నాకు ఒక కోట్ పంపాడు. 'నువ్వు ఎందుకు ఒంటరిగా ఉన్నావు? నువ్వు అందంగా, ఆకర్షణీయంగా ఉన్నావు' కదా అని అడిగాడు. దానికి నేను ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయానని చెప్పా. మంచి భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే మీరు పరిపూర్ణం కావాలని అవసరం లేదు.  గతంలో నాకు కూడా ఆ అపోహ ఉండేది." అని పెళ్లిపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది బాలీవుడ్ భామ.

ఇక సినిమాల విషయానికొస్తే దివ్య దత్తా చివరిసారిగా ఛావా చిత్రంలో కనిపించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ , అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం దివ్య  అర్జున్ రాంపాల్‌తో కలిసి నాస్టిక్‌లో కనిపించనుంది. ఈ సినిమాకు శైలేష్ వర్మ దర్శకత్వం వహించారు. 

 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)