Breaking News

సైన్యంలోనే కాదు ఇక్కడా హీరోనే.. అక్కపై హీరోయిన్‌ ప్రశంసలు

Published on Mon, 04/21/2025 - 12:54

పాడుబడ్డ ఇంట్లో చంటిపాప ఏడుపు.. ఆకలిదప్పికలతో ఎంతసేపటినుంచి అలమటిస్తుందో.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న హీరోయిన్‌ దిశా పటానీ (Disha Patani) అక్క ఖుష్బూకు ఆమె ఆకలికేకలు, ఆర్తనాదాలు వినిపించాయి. వెంటనే సగానికి పైగా కూలిపోయి ఉన్న ఇంట్లోకి వెళ్లి చూసింది. అక్కడ ఓ చిన్నారి ఒంటరిగా కనిపించింది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. ఆకలేస్తే మట్టి తిన్నదో ఏమో.. ముఖమంతా మట్టికొట్టుకుపోయి ఉంది. 

చిన్నారిని కాపాడిన మేజర్‌
ఆ చిన్నారిని  ఖుష్బూ (Major Khushbu Patani) జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి అధికారులకు అప్పగించారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన జరిగింది. ఇది జరిగిన మరుసటి రోజు ఖుష్బూ.. ఆస్పత్రికి వెళ్లి చిన్నారి పరిస్థితిని సమీక్షించారు. పాపను ఎత్తుకుని ఆడించారు. అలాగే ఓ శుభవార్త కూడా చెప్పారు. పోలీసులు.. ఆ చిన్నారి పేరెంట్స్‌ను కనుగొన్నారని వెల్లడించారు. 

పేరెంట్స్‌ చెంతకు పాప
అయితే ఎవరో దుండగులు పాపను కిడ్నాప్‌ చేశారని, వాళ్లే ఇలా వదిలేసి పోయారని వివరణ ఇచ్చారు. ఇకపై పాపను మిస్‌ అవుతానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. ఇది చూసిన అభిమానులు మీరు చాలా గ్రేట్‌,  పాపను పేరెంట్స్‌ చెంతకు చేర్చారు అని కామెంట్లు చేస్తున్నారు. ఖుష్బూ సోదరి సైతం.. అక్కా, నువ్వు నిజమైన హీరో అని కామెంట్‌ చేసింది.

అక్క మేజర్‌, చెల్లెలు హీరోయిన్‌
ఖుష్బూ గతంలో ఇండియన్‌ ఆర్మీలో పని చేశారు. మేజర్‌గానూ సేవలందించారు. సైన్యంలో తన సేవలకు రిటైర్‌మైంట్‌ ప్రకటించిన ఆమె ప్రస్తుతం ఫిట్‌నెస్‌ కోచ్‌గా పని చేస్తున్నారు. ఖుష్బూ చెల్లెలు దిశా పటానీ విషయానికి వస్తే.. ఈమె 'లోఫర్‌' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. గతేడాది వచ్చిన ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' మూవీలోనూ యాక్ట్‌ చేసింది. 'ఎంఎస్‌ ధోని: ద అన్‌టోల్డ్‌ స్టోరీ', 'ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌', 'భాగీ 2', 'భరత్‌', 'మలంగ్‌', 'రాధే', 'యోధ' సినిమాలతో పాపులర్‌ అయింది. ప్రస్తుతం 'వెల్‌కమ్‌ టు ద జంగిల్‌' మూవీలో నటిస్తోంది.

 

 

చదవండి: మమ్మల్నే కాదు, మా అమ్మను కూడా.. చాలా డిస్టర్బ్‌ అయ్యా: విష్ణుప్రియ

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)