Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా

Published on Tue, 07/21/2026 - 14:42

సాధారణంగా ఓ వయసొచ్చిన తర్వాత దర్శకులు దాదాపుగా సినిమాలు చేయడం తగ్గించేస్తుంటారు. కానీ రీసెంట్ టైంలో టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, 94 ఏళ్ల వయసులోనూ 'సింగ్ గీతం' అనే చిత్రం తీసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈయనలానే హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూడా 79 ఏళ్ల వయసులోనూ ఇంకా చలాకీగా మూవీస్ చేస్తున్నారు. ఈయన తీసిన లేటెస్ట్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

జురాసిక్ పార్క్, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్, మ్యూనిచ్, ద టెర్మినల్, ఇండియానా జోన్స్ తదితర సినిమాలతో అద్భుతమైన గుర్తింపు సాధించిన స్టీవెన్ స్పీల్‌బర్గ్ తీసిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'డిస్‌క్లోజర్ డే'. గత నెల 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఓ మేరకు ఆకట్టుకుంది. ఏలియన్స్ కాన్పెప్ట్‌తో తీసిన ఈ చిత్రం ఇప్పుడు విదేశాల్లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో ఇంగ్లీష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

డిస్‌క్లోజర్ డే విషయానికొస్తే.. ఓ సైబర్ సెక్యూరిటీ విజిల్ బ్లోయర్ డేనియల్ (జోష్ ఓ కానర్), వాతావరణ శాస్త్రవేత్త మార్గెట్(ఎమిలీ బ్లంట్).. అమెరికా ప్రభుత్వం దాచిపెట్టిన గ్రహాంతరవాసుల రహస్య ఆధారాలని బయటపెట్టాలనుకుంటారు. ఈ క్రమంలోనే ఏజెన్సీ చీఫ్ నోవా (కోలిన్ ఫెర్త్) నుంచి వీళ్లిద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. గ్రహాంతరవాసులు నిజంగానే భూమిపైకి వస్తే మానవాళి ఎలా స్పందిస్తుందనేది ఇందులో చూపించే ప్రయత్నం చేశారు.

(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)