Breaking News

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బస్సు ఎక్కుతూ దర్శకుడు కన్నుమూత

Published on Mon, 06/02/2025 - 09:34

కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు  విక్రమ్ సుగుమారన్ కన్నుమూశారు. మధయనాయక్ కూట్టం, రావణ కొట్టం చిత్రాలకు ప్రసిద్ధి చెందిన విక్రమ్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. మధురైలో బస్సు ఎక్కుతుండగా ఒక్కసారిగా హార్ట్ అటాక్‌ రావడంతో మరణించారు.

శంతను భాగ్యరాజ్, ప్రభు, కతీర్‌తో సహా అనేక మంది ప్రముఖ నటులతో కలిసి విక్రమ్‌ సుగుమారన్ పనిచేశారు. డైరెక్టర్‌ మరణం పట్ల నటుడు శాంతను భాగ్యరాజ్‌ సంతాపం వ్యక్తం చేశారు. మీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. సోదరుడిలా భావించే నీ నుంచి తాను ఎంత నేర్చుకున్నాననని అన్నారు. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచకుంటానని పోస్ట్ చేశారు. చాలా త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయావ్.. మిస్‌ అవుతున్నందుకు చాలా బాధగా ఉందంటూ ట్వీట్ చేశారు. దర్శకుడు మరణవార్త తెలుసుకున్న అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

కాగా.. విక్రమ్ సుకుమారన్ 2013లో మధయనాయక్ కూట్టం చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రం  విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రంలో కథిర్, అంజు జంటగా నటించారు. అంతకుముందు విక్రమ్‌.. బాలు మహేంద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. పొల్లాధవన్, కోడివీరన్ వంటి చిత్రాల్లో కూడా నటించారు. 2023లో వచ్చిన 'రావణ కొట్టం'తో సూపర్‌ హిట్‌ కొట్టారు. ఆడుకాలం మూవీకి మాటల రచయితగా కూడా పనిచేశారు. ఆయన చివరిసారిగా 'థెరం బోరం' చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదని సమాచారం. 
 

 

Videos

పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ

దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు

వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే

థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్

రాహుల్, సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు

దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు

టీడీపీ నేతల వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

గురజాలలో ఉద్రిక్తత

Photos

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)