Breaking News

రజనీకాంత్ 173వ సినిమా.. వారంలోనే తప్పుకొన్న దర్శకుడు

Published on Thu, 11/13/2025 - 14:20

ఈ ఏడాది 'కూలీ'తో ప్రేక్షకుల్ని పలకరించిన రజనీకాంత్ నుంచి వారం క్రితం కొత్త సినిమా ప్రకటన వచ్చింది. తమిళ దర్శకుడు సుందర్‌తో కలిసి పనిచేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్టుని హీరో కమల్ హాసన్ నిర్మించనున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఇప్పడు అకస్మాత్తుగా ఈ మూవీ నుంచి సుందర్ తప్పుకొన్నారు. ఈ విషయమై ఇప్పుడు అధికారికంగా నోట్ కూడా రిలీజ్ చేశారు.

'అనుకోని పరిస్థితుల కారణంగా #తలైవర్173 నుంచి తప్పుకొంటున్నాను. అయినా సరే రజనీకాంత్, కమల్ హాసన్‌లతో అనుబంధం అలానే కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా వాళ్లతో గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి' అని సుందర్.సి తన నోట్‌లో రాసుకొచ్చారు. కానీ ఎందుకు బయటకొచ్చేయాల్సి వచ్చింది? ఏమైంది? అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

(ఇదీ చదవండి: న్యూయార్క్‌లో అనిరుధ్-కావ్య మారన్.. ఏం జరుగుతోంది?)

ఇకపోతే రజనీకాంత్-కమల్ హాసన్ కాంబో అనగానే చాలామంది కలిసి నటిస్తారని అనుకున్నారు. కానీ రజనీ హీరోగా, కమల్ నిర్మాత అనేసరికి కాస్త సంబరపడ్డారు. కానీ దర్శకుడిగా సుందర్ అనేసరికి చాలామంది అభిమానులు అసంతృప్తికి గురయ్యారు. దీనికి కారణముంది. గతంలో రజనీకాంత్‌కి 'అరుణాచలం' లాంటి హిట్ చిత్రాన్ని సుందర్ ఇచ్చినప్పటికీ.. రీసెంట్ టైంలో అయితే దెయ్యాల సినిమాలు తీస్తున్నాడు. వీటికి డబ్బులొస్తున్నాయి గానీ అంతంత మాత్రంగానే ఆడుతున్నాయి.

ఇలాంటి దర్శకుడిగా రజనీకాంత్-కమల్ హాసన్.. అసలు ఎలా అవకాశమిచ్చారా అని.. అనౌన్స్‌మెంట్ వచ్చిన టైంలోనే చాలామంది అనుకున్నారు. ఇప్పుడు సుందర్ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో, ఈయన స్థానంలోకి వచ్చే కొత్త దర్శకుడు ఎవరా అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే సుందర్ నోట్‌ని, ఇతడి భార్య, నటి ఖుష్బూ తొలుత సోషల్ మీడియాలో పంచుకుంది. మరి ఏమైందో ఏమో గానీ వెంటనే డిలీట్ చేసింది.

(ఇదీ చదవండి: ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్‌ మిస్!)

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు