Breaking News

అలాంటి పాటలంటే నాకు ఇష్టం లేదు.. కానీ: సుకుమార్

Published on Wed, 05/08/2024 - 13:41

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో పుష్ప-2: ది రూల్‌ మరో వంద రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్పకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన  వచ్చింది. రిలీజైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌ సొంతం చేసుకుంది.

అయితే వీరిద్దరి కాంబోలో 20 ఏళ్ల క్రితం వచ్చిన ఆర్య సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ 20 ఏళ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో డైరెక్టర్‌ సుకుమార్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. అసలు తన సినిమాలో ఐటమ్ సాంగ్‌ పెట్టడం తనకిష్టం లేదని అన్నారు. ఐటమ్‌ సాంగ్స్‌ తనకు నచ్చవని సరదాగా కామెంట్స్ చేశారు.

సుకుమార్ మాట్లాడుతూ.. 'ఐటమ్ సాంగ్ నాకిష్టం లేదు. అ అంటే అమలాపురం లిరిక్ నాకు నచ్చింది. అది రాసేటప్పుడు టైం లేదు. వేటూరి దగ్గరకు పంపించాను. 'అల్లుగారి పిల్లగాడా' అంటే ఏంటి? అతను నా హీరో ఆర్య.. అల్లుగారి అబ్బాయి కాదు' అని చెప్పా. ఆర్య వచ్చి హీరోయిన్‌ను వెతుక్కోవాలి కానీ.. అరవింద్‌ గారి అబ్బాయి అంటే ఈజీగా హీరోయిన్‌ను పటగొట్టేస్తాడు . ఆర్యకు బైక్‌ కూడా లేదు.. చాలా పూర్. కేవలం సైకిల్ మాత్రమే ఉంది అంటూ నవ్వారు. నాకిష్టం లేకపోయినా నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటం సాంగ్ వచ్చేసింది. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది. ఐటమ్‌ సాంగ్‌ ఉంటే సినిమాను ఇంత దూరం తీసుకెళ్తుందా?.. ఇంత వైబ్ వస్తుందా? అనే మూడ్‌లోకి వచ్చేశాను. కానీ దిల్‌ రాజు ఏమో ఒక్క ఐటెం సాంగ్ కూడా లేకుండా కళాత్మకంగా సినిమాలు చేస్తున్నారు' అని అన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌