Breaking News

'సినిమాలో సూపర్ హిట్‌ సీన్‌'.. ఐ బొమ్మ రవి అరెస్ట్‌పై రాజమౌళి

Published on Mon, 11/17/2025 - 15:36

కేవలం సినీ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌కు కోట్ల రూపాయలు నష్టం తెచ్చిపెట్టిన ఐ బొమ్మ రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విదేశాల నుంచి వస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అతని గురించే చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐ బొమ్మ రవి గురించి ఆయన మాట్లాడారు. ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడం సినిమాలో సూపర్ హిట్ సీన్‌లా ఉందన్నారు. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరో తీసుకెళ్లి కటాకటాల వెనక్కి పంపినట్లు ఉందని తెలిపారు. తనకు తానే భస్మాసుర హస్తంలాగా బయట పెట్టుకున్నాడు.. పోలీసులతో ఎవరూ కూడా ఛాలెంజ్ చేయవద్దని అన్నారు. ఐ బొమ్మ రవిని అరెస్ట్‌ చేసిన పోలీసులకు, సీపీ సజ్జనార్‌కు రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందే రాజమౌళితో పాటు మెగాస్టార్, నాగార్జున కలిసి సీపీ సజ్జనార్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పారు.

ఇదొక పెద్ద అచీవ్‌మెంట్.. మెగాస్టార్

ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడం పెద్ద అచీవ్‌మెంట్‌ అని మెగాస్టార్ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి పైరసీ వల్ల గేమ్ ఛేంజర్, ఓజీ, కింగ్‌డమ్ లాంటి పెద్ద సినిమాలు  చాలా నష్టపోయాయని తెలిపారు. రాజమౌళి పెద్ద సినిమా చేస్తున్నారని..మన తెలుగు సినిమా ఖండాంతరాలు దాటుతున్న సమయంలో పైరసీ అనేది ఇండస్ట్రీకి చాలా బాధ కలిగిస్తుందని చిరంజీవి అన్నారు. 
 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)