Breaking News

పెయిన్‌తోనే విజయ్, త్రిషలపై కామెంట్‌ చేశా: సముద్రఖని

Published on Fri, 03/27/2026 - 07:52

టీవీకే అధినేత విజయ్, త్రిష వివాదానికి సంబంధించి వైరల్ అయిన తన వ్యాఖ్యల వివాదంపై నటుడు, దర్శకుడు సముద్రఖని తాజాగా స్పందించారు. తాను నటించిన ‘కార్మేని సెల్వం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. విజయ్‌పై తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, సందర్భానికి సంబంధం లేకుండా వాటికి వక్రీకరణలు చేశారని ఆయన అన్నారు. తాను నిజాయితీగా మాట్లాడానని, ఎవరినీ అవమానించే ఉద్దేశం తనకు లేదని  స్పష్టం చేశారు. తన ఆలోచనలను వ్యక్తం చేసినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేశారని  క్లారిటీ ఇచ్చారు. 

'పాత వీడియోలో నేను మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి మొదటి నుంచి కాకుండా మధ్యలో వీడియో రికార్డ్‌ చేశారు. అయితే, తను రికార్డ్‌ చేస్తున్నాడు కదా అని నేను మాట్లాడటం ఆపలేదు. విజయ్‌ మొదట సపోర్ట్‌ ఇచ్చింది నేనే.. కాబట్టే కాస్త నాకు పెయిన్‌గానే ఉంటుంది.' అని వివరించారు.

ఏం జరిగిందంటే..?
విజయ్‌, త్రిష ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇదే అంశం గురించి సముద్రఖని కొందరితో చర్చిస్తన్న వీడియో వైరల్‌ అయింది. వారిద్దరి తీరుపై సముద్రఖని తన అసంతృప్తిని బయటపెట్టారు. 'ఇదేమైనా ఆటా..? వ్యక్తిగత విషయాలను  ఇలా బయటపెట్టాలా..? ఎవరి మీద పగ తీర్చుకుంటున్నారు..? అంతా సవ్యంగ జరుగుతున్న సమయంలో ఇలాంటివి అవసరమా..? ఈ కారణంతో పార్టీలోని కొందరు సపోర్టర్స్ వెళ్లిపోతున్నారు' అని ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ వీడియో కాస్త వైరల్‌ అయింది.
 

Videos

ప్రశ్నిస్తే తాట తీస్తా.. జనసేన నేతను గెంటేసిన పవన్

భారత అన్నదాతల గుండెల్లో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ సెగ..

తెలుగు ప్రజలకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు

ప్రేయర్ లో కామెడీ.. ఈ బుల్డోడు చేసిన పనికి నవ్వాగదు..

జర జాగ్రత్త.. మార్కెట్లో కల్తీ ఐస్ క్రీం..

టార్గెట్ 72 గంటలు యుద్ధానికి సిద్దమైన భారత్

కొత్తగా బిల్డింగ్ కడుతున్నారా.. ఈ రూల్స్ మీకోసమే!

ఆరు నెలల్లోనే ఆ నిర్ణయం తీసుకున్నాం.. విభేదాలపై ప్రియాంక చోప్రా రియాక్షన్

శ్రీరామనవమికి షాక్ ఇచ్చిన బంగారం.. తులం ఎంతంటే..?

పెళ్లి తర్వాత తొలి వెకేషన్ ట్రిప్.. విరోష్ జంట వీడియో వైరల్

Photos

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)

+5

భద్రాచలంలో కనుల పండువగా శ్రీసీతారాముల ఎదుర్కోలు ఉత్సాహం (ఫొటోలు)

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)