Breaking News

ప్రభాస్‌ను చూసి చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన డైరెక్టర్‌.. వీడియో వైరల్

Published on Sun, 12/28/2025 - 08:22

ది రాజాసాబ్‌ డైరెక్టర్‌ మారుతి ​‍ఆసక్తికర కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన మారుతి దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళికి ప్రతి డైరెక్టర్ రుణపడి ఉన్నామని తెలిపారు. ఇవాళ చాలామంది పాన్ ఇండియా అని కాల్ ఎగరేసుకుని తిరుగుతున్నామంటే కారణం ఆయనే అన్నారు. నిజంగా టాలీవుడ్‌కు ఇది స్వర్ణయుగమని తెలిపారు.

నా లాంటి మిడ్ రేంజ్ సినిమాలు తీసే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టారని మారుతి తెలిపారు. ఒక మిడ్ రేంజ్ హీరోని పాన్ ఇండియా హీరోగా చేసి ఒక పెద్ద కటౌట్ అందించారని అన్నారు. ఒక సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్, అల్లు అర్జున్,  ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా ఎంతోమంది స్టార్స్‌ను తయారు చేసిన ఘనత ఆయనదేనన్నారు. 

అంతేకాకుండా హీరో ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు డైరెక్టర్ మారుతి. ఆయన ఒక శక్తి అని కొనియాడారు. నా వెనకాల ఉన్నది మామూలు శక్తి కాదు.. ఆయన కేవలం యాక్టింగ్ చేసి వెళ్లిపోవడం కాదు.. తన లైఫ్‌ పెట్టేశారని అన్నారు. సినిమాతో ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేమన్నారు. ఆ ప్రతి రూపమే ఇవాళ మన ఎదురుగా కూర్చుందని ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్‌. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్‌ చేయగా.. ‍అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది.ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్‌ హీరోయిన్లుగా నటించారు.  ఈ మూవీ సంక్రాంతి పోటీలో నిలిచింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.

 


 

 

 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)