Breaking News

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు దర్శకుడు మారుతి క్షమాపణలు

Published on Mon, 11/24/2025 - 13:52

డార్లింగ్‌ ప్రభాస్‌ (Prabhas) లేటెస్ట్‌ మూవీ రాజాసాబ్‌. ఈ హారర్‌ కామెడీ మూవీని మారుతి తెరకెక్కిస్తున్నాడు. జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌ షురూ చేశారు. రాజా సాబ్‌ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. అయితే ఈ వేదికపై దర్శకుడు మారుతి కొన్ని అనవసరమైన డైలాగులు కొట్టాడు.

మారుతిపై ట్రోలింగ్‌
సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పిన మారుతి.. పండక్కి ప్రభాస్‌ అభిమానులు కాలర్‌ ఎగరేసుకుంటారు అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రభాస్‌ కటౌట్‌కు అవన్నీ చిన్నమాటలైపోతాయి అన్నాడు. ఈ కామెంట్స్‌పై జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు హర్టయ్యారు. ఎందుకంటే ఇటీవలే తారక్‌ వార్‌ 2 రిలీజ్‌ సమయంలో తన రెండు కాలర్స్‌ పైకి ఎగరేసి చూపించారు.

క్షమాపణలు చెప్పిన మారుతి
ఇప్పుడు మారుతి.. ప్రభాస్‌ కటౌట్‌కి కాలర్‌ ఎగరేయడం చిన్న విషయం అనడంతో తారక్‌ ఫ్యాన్స్‌ అతడిని ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. దీంతో మారుతి సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఎన్టీఆర్‌ అభిమానులందర్నీ క్షమించమని కోరుతూ ట్వీట్‌ చేశాడు.

నా ఉద్దేశం అది కాదు
ముందుగా అభిమానులకు క్షమాపణలు. నేను ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఆ కామెంట్స్‌ చేయలేదు. నేనేదో ఫ్లోలో మాట్లాడాను. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎన్టీఆర్‌గారంటే ఎనలేని గౌరవం. నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు. అది మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని మారుతి రాసుకొచ్చాడు.

 

 

చదవండి: అందంగా రెడీ అయిన ఖుష్బూ.. ముఖం కడుక్కోమన్న కమల్‌

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)