Breaking News

ఆ సీన్స్‌లో ప్రభాస్‌ నటన అద్భుతం అంటున్నారు: దర్శకుడు మారుతి

Published on Wed, 01/14/2026 - 00:24

‘‘ది రాజా సాబ్‌’ వంటి సినిమా చేయడం అంత సులువు కాదు. ఒక వ్యక్తి ట్రాన్స్‌లోకి వెళ్లాడనే విషయాన్ని విజువల్‌గా స్క్రీన్‌పై చూపించడం చాలా కష్టం. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాను 40 రోజుల్లోనే రాసిన నేను, ‘ది రాజా సాబ్‌’ క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ కోసం రెండు నెలలు స్క్రిప్ట్‌ రాశాను. ఈ సీన్స్‌ గురించి నేను, ప్రభాస్‌గారు మాట్లాడుకున్నాం... ‘పెన్‌తో రాస్తున్నావా? లేదా గన్‌తో రాస్తున్నావా? డార్లింగ్‌’ అన్నారు ప్రభాస్‌గారు.

ఇంకా సంక్రాంతి ఫెస్టివల్‌ మూడ్‌ స్టార్ట్‌ కాకముందే నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల వసూళ్లు సాధించింది. మా ‘రాజా సాబ్‌’ ప్రేక్షకులకు నచ్చింది కాబట్టే ఈ స్థాయి కలెక్షన్స్‌ వచ్చాయి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ప్రభాస్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘ది రాజా సాబ్‌’. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్‌ హీరోయిన్లుగా నటించగా, సంజయ్‌ దత్, బొమన్‌ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా 
ఈ నెల 9న విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి పంచుకున్న విశేషాలు. 

‘ది రాజాసాబ్‌’లో సైకలాజికల్‌ ఎలిమెంట్స్‌తో ఓ కొత్త పాయింట్‌ చూపించాం కాబట్టి ప్రేక్షకులకు రీచ్‌ కావడానికి కొంత సమయం పడుతుందని ముందే ఊహించాం. ‘కొత్త ప్రయత్నం చేశాం డార్లింగ్‌... ప్రేక్షకులకు చేరువ కావడానికి కొంత టైమ్‌ పడుతుంది.. నువ్వు ప్రశాంతంగా ఉండు’ అని ప్రభాస్‌గారు చెప్పారు. అయితే సినిమా విడుదలైన తర్వాత మేం ట్రైలర్‌లో చూపించిన ప్రభాస్‌గారి ఓల్డ్‌ గెటప్‌ సీన్స్‌ లేవని కొందరు ఫ్యాన్స్‌ అన్నారు. దీంతో ఈ సీన్స్‌ను యాడ్‌ చేశాం. కొత్త సీన్స్‌ యాడ్‌ చేశాక, సీన్స్‌ అన్నీ పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యాయని ప్రభాస్‌గారు అన్నారు.

ప్రభాస్‌గారిలాంటి పాన్‌ ఇండియా హీరోతో సాదా సీదా హారర్‌ కామెడీ సినిమా చేయకూడదనే ఈ సినిమాలో సైకలాజికల్, మైండ్‌ గేమ్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేశాను. తొలిసారి చూసినప్పుడు ఈ సినిమా నచ్చుతుంది. రెండోసారి కూడా చూస్తే ఈ సినిమాలోని కాన్సెప్ట్‌ లోతుగా అర్థం అవుతుంది. మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటే అనుకున్నది సాధించవచ్చనే సందేశాన్ని కూడా ఈ సినిమాలో చూపించాం.

హాస్పిటల్‌ సీన్‌లో  రాజా సాబ్‌ పాత్ర తనకు బుర్ర తిరిగిపోతుందని ఇబ్బంది పడుతుంటాడు. అప్పుడు నానమ్మపై ప్రేమతో దెయ్యంపై గెలుస్తాడు. వేదికపై నేను చాలెంజ్‌ చేయలేదు. హాస్పిటల్‌ ఎపిసోడ్‌లో ప్రభాస్‌గారి నటన అద్భుతంగా ఉంటుందనే కాన్ఫిడెన్స్‌తో మాట్లాడాను. నేను చెప్పినట్లుగానే రిలీజ్‌ తర్వాత ఆ సీన్‌లో ప్రభాస్‌గారి నటన అద్భుతం అని అందరూ అంటున్నారు. 

నేను చిరంజీవిగారి ఫ్యాన్‌ని. ఆయనతో సినిమా చేసే చాన్స్‌ వస్తే నా లైఫ్‌ సర్కిల్‌ ఫుల్‌ అయిపోయినట్లుగా భావిస్తాను. 

Videos

విభజన హామీలు ముగిశాయనే వాళ్లు ఆంధ్రా ద్రోహులు: చలసాని

Ravi Chandra : లోకేష్ రెడీగా ఉండు.. నీ కాలర్ పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు

చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్..?

Talasani : మా ఆత్మగౌరవంపై దెబ్బ కొడితే చూస్తూ ఊరుకోం

Satish Reddy: కేసులో మాఫీ చేసుకుని సంబరపడకు YSRCP నిన్ను వదిలిపెట్టదు

గ్రీన్ లాండ్ విలీనం కోసం బిల్లు తెచ్చిన అమెరికా

Kannababu : 8 కేసులు ఎత్తేశారు..ED పెట్టిన కేసులో గోల్ మాల్

విజయవాడ హైవేపై లారీ బోల్తా పల్టీ కొట్టిన కట్టెల లోడ్ లారీ

Achanta: ఎమ్మెల్యే సేవలో ఎంపీడీవో.. గుండెపోటు నాటకం?

CCTV Footage: కోనసీమలో కారు బీభత్సం

Photos

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)

+5

ప్రముఖ నటుడికి సన్మానం.. హాజరైన మీనా (ఫోటోలు)

+5

ఒకే ఫ్రేమ్‌లో నమ్రత, లక్ష్మీ ప్రణతి (ఫోటోలు)

+5

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత మరింత కళగా సమంత (ఫోటోలు)

+5

బుల్లితెర నటులు 'ఇంద్రనీల్, మేఘన'ల గృహప్రవేశం (ఫోటోలు)