Breaking News

ఎట్టకేలకు స్పందించిన డైరెక్టర్ క్రిష్

Published on Tue, 07/22/2025 - 10:49

'హరిహర వీరమల్లు' మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలోనే డైరెక్టర్ క్రిష్ ఎక్కడా కనిపించలేదు. సినిమాని మొదలుపెట్టి, చాలావరకు షూటింగ్ చేసింది ఈయనే. తర్వాత పలు కారణాల వల్ల తప్పుకొన్నాడు. మూవీ రిలీజ్ దగ్గరవుతున్నా క్రిష్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తలో మాట అనుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో క్రిష్ ట్వీట్ చేశాడు.

(ఇదీ చదవండి: 'పుష్ప' ఘటన తరువాత మళ్లీ 'హరిహర..' కోసం బెనిఫిట్‌ షోలు)

అంతకు ముందు నిర్మాత ఏఎం రత్నం కావొచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ కావొచ్చు.. క్రిష్ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే 'హరిహర వీరమల్లు' గురించి సరిగ్గా రిలీజ్‌కి రెండు రోజుల ముందు క్రిష్ ట్వీట్ చేశారు. 'ఈ సినిమాకు దర్శకుడిగానే కాకుండా ఓ చరిత్ర పరిశోధకుడిగా, నమ్మలేని నిజాల్ని తవ్వితీసే సాధకుడిలా, ఓ ప్రపంచాన్ని నిర్మించాలన్న కలతో ముందగుడు వేసేవాడిగా, వినోదాన్ని, విజ్ఞానాన్ని సమకూర్చే సినిమా మీద నమ్మకం ఉన్నవాడిగా నాకో పెద్ద యుద్దాన్నే పరిచయం చేసింది' అని రాసుకొచ్చారు.

అలానే హీరో, నిర్మాతకు కూడా క్రిష్.. తన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. వీళ్లిద్దరికి తప్పితే తన తర్వాత మిగిలిన పార్ట్ అంతా తీసిన జ్యోతికృష్ణకు గానీ, మిగిలిన టీమ్ గురించి గానీ క్రిష్ ఎక్కడా ప్రస్తావించలేదు. ఏదైతేనేం ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉండటంతో క్రిష్, టీమ్ మధ్య ఏమైనా ఉందేమోనని అంతా అనుకున్నారు. ఇప్పుడు ట్వీట్ చేయడంతో అలాంటివేం లేవని ఓ క్లారిటీ వచ్చేసింది.

(ఇదీ చదవండి: Hari Hara Veera Mallu: మీడియా ప్రతినిధులపై పోలీసుల దురుసు ప్రవర్తన)

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)