Breaking News

'హరిహర'.. మరోసారి స్పందించిన క్రిష్

Published on Sun, 08/31/2025 - 17:09

గత నెలలో రిలీజైన 'హరిహర వీరమల్లు' ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్మాతకు భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకుడిగా వ్యవహరించారు. మరి ఏమైందో ఏమో గానీ ఈయన తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ.. మిగిలిన పార్ట్ అంతా తీశారు. సరే ఫలితం ఏంటనేది పక్కనబెడితే ఇప్పుడు క్రిష్.. ఈ మూవీ గురించి స్పందించాడు.

'హరిహర వీరమల్లు' ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత నిర్మాతగా 'అరేబియా కడలి' అనే సిరీస్ తీసిన క్రిష్.. హీరోయిన్ అనుష్కని లీడ్ రోల్‌లో పెట్టి 'ఘాటీ' అనే యాక్షన్ మూవీ తీశారు. సెప్టెంబరు 5న ఇది థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన క్రిష్.. 'హరిహర..' వచ్చిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు. రిలీజ్ టైంలో ట్వీట్ చేసిన ఈ దర్శకుడు.. ఇప్పుడు నేరుగా మాట్లాడాడు.

(ఇదీ చదవండి: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి అప్పుడే చేసుకుంటాం: హీరోయిన్ నివేతా)

'హరిహర వీరమల్లు కొంత భాగం నేను చిత్రీకరించాను. నా వ్యక్తిగత కారణాల వల్ల పక్కకు రావాల్సి వచ్చింది' అని క్రిష్ చెప్పుకొచ్చాడు. బహుశా ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండటమే క్రిష్.. సినిమా నుంచి బయటకు రావడానికి కారణం ఏమో అనిపిస్తుంది. అనుష్కతో చేసిన 'ఘాటీ'పై ఓ మాదిరి బజ్ అయితే ఉంది. 

'ఘాటీ'లో అనుష్క లీడ్ రోల్ చేయగా.. తమిళ హీరో విక్రమ్ ప్రభు ఈమె సరసన నటించాడు. కొండల్లో స్మగ్మింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. యువీ క్రియేషన్స్ నిర్మించింది. రెండేళ్ల క్రితం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మూవీతో సక్సెస్ అందుకున్న స్వీటీ.. ఈసారి ఏం చేస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'జెర్సీ' వదులుకున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)