Breaking News

టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో ‘6జర్నీ’

Published on Wed, 05/07/2025 - 16:07

రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘6జర్నీ’.  పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బసీర్ ఆలూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 9న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు బసీర్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

→ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడ్డాను. ఇది వరకు తెలుగులో సమరం, కన్నడలో మరో చిత్రాన్ని చేశాను. ఇప్పుడు నా మూడో సినిమా 6 జర్నీ అంటూ ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను. ఇది ఆరుగురి జీవిత ప్రయాణం. గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేసి సూసైడ్ చేసుకోవాలని అనుకునే ఓ బ్యాచ్ కథే ‘6జర్నీ’. అలాంటి వారి ప్రయాణంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథ.

→ సమీర్, పల్లవి జంట అద్భుతంగా నటించింది. కొత్త అబ్బాయి విలన్‌గా అభిరాం చక్కగా నటించారు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త ఫైట్ మాస్టర్ ఇలా అందరూ అద్భుతంగా పని చేశారు. నిర్మాతది మా ఊరే. ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. ఈ కథ ఆయనకు నచ్చడంతో ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది.

→ వర్షాకాలంలో ఈ మూవీ షూటింగ్ చేశాం. షూటింగ్ సమయంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. ప్రకృతి మాకు ఎంతో సహకరించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా షూటింగ్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేశాం.

→ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎన్ సింహా మంచి పాటల్ని ఇచ్చారు. మంచి సంగీతం, మంచి పాటలు ఉన్నాయి. ఆల్రెడీ మా పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. మంచి కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.

→ క్లైమాక్స్ చాలా గొప్పగా ఉంటుంది. శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? ఇక్కడ యువత ఎలా పోరాడాలి అంటూ దేశ భక్తిని రేకెత్తించేలా క్లైమాక్స్‌ను అద్భుతంగా తెరకెక్కించాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా క్లైమాక్స్ ఉంటుంది. సినిమా పూర్తిగా టెర్రరిజం మీదే నడుస్తుంది. అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువే అయింది. బోర్డర్‌లో సినిమా షూటింగ్, వర్షాకాలం అవ్వడంతో కాస్త బడ్జెట్ పెరిగింది.

→ మళ్లీ అక్టోబర్‌లో ఓ సినిమాను చేయబోతోన్నాను. ముంబై బ్యాక్ డ్రాప్‌లో ఆ చిత్రం ఉంటుంది. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాను.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)