Breaking News

నా సినిమాలో ఆ సీన్‌ను అమ్మాయిలు షేర్‌ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్‌ క్షమాపణ

Published on Sat, 04/12/2025 - 17:06

సాధారణంగా తాము తీసిన చిత్రాల్లోని తప్పొప్పుల గురించి నిజాయితీగా సమీక్షించుకునే దర్శకులను మనం చూడలేం. ఇక  సినిమా రూపొందించే సమయంలో తమపై ఉన్న సామాజిక బాధ్యతను కూడా గుర్తించుకోవడం అంటే అలాంటి దర్శకుల్ని భూతద్ధం పెట్టి వెదకాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ డైరెక్టర్‌ తాను తీసిన సినిమాలోని సన్నివేశాల గురించి తానే చెప్పి...అవి అలా తీసి ఉండకూడదని, సమాజంపై వ్యతిరేక ప్రభావం చూపే అలాంటి సీన్స్‌ తీసి, రాసినందుకు పశ్చాత్తాప పడుతున్నానని చెప్పడం ఓ విశేషం. అంతేకాదు...ఈ చిత్రం అతనికి గణనీయమైన ప్రశంసలు  విజయాన్ని అందుకున్నది కావడం మరింత విశేషం.  

దర్శకుడు అరుణ్‌ కుమార్‌ ఇటీవల తెరకెక్కించిన 'వీర ధీర శూరన్‌' ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ దర్శకుడు అంతకు ముందు దర్శకత్వం వహించిన  సేతుపతి (2016) గురించి ప్రస్తావించాడు.  విజయ్‌ సేతుపతి  రమ్య నంబీస్సన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ తమిళ యాక్షన్‌ డ్రామా హిట్‌ అయినందుకు ఆయన గర్వపడలేదు. పైగా ఆ సినిమాలో ఆక్షేపణీయ అంశాలు ఉన్నాయని పేర్కొన్నాడు.  అయితే అవి   ఆ సమయంలో గుర్తించేందుకు తనకు అవసరమైన అనుభవం లేదని అన్నాడు. తాను తీసిన ఆ సన్నివేశాన్ని యువతులు సోషల్‌ మీడియాలో  పంచుకోవడం గమనించాక మాత్రమే ఒక సినిమా ప్రభావం ఎంత ఉంటుంది? అనేది  తనకు స్పష్టమైందని కూడా అతను చెప్పాడు.

సేతుపతిలో ఉన్న ఆ సన్నివేశం ఏమిటంటే...
‘నన్ను కొట్టినా.. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి ప్రేమగా నన్ను అక్కున చేర్చుకుంటాడు. అందుకే అతనంటే ఇష్టం’ అని రమ్య నంబీస్సన్‌ అంటుంది. అంటే మగవాళ్లు ఆడవాళ్లపై శారీరక హింసను ప్రేరేపించేదిగా ఆ సంభాషణ ఉండడం గమనార్హం. ఆ సన్నివేశం తీయడంతో పాటు ఆ సినిమాకు రచయిత కూడా అయిన అరుణ్‌కుమార్‌ ఇప్పుడు దాని గురించి బాధపడ్డారు. ‘‘అది తప్పు. అప్పట్లో నేను ఏం చేశానో..నాకు అనుభవం లేదు’’ అంటూ ఆయన వెల్లడించాడు. కోట్ల మంది సినిమా చూస్తారని, అది అలా అలా విస్త్రుతం అవుతూనే ఉంటుందని   కాబట్టి, మన సినిమాల్లో మనం ఒక చిన్న తప్పు చేస్తే, అది ఎప్పటికీ చేసినట్లే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. అమ్మాయిలు ఆ సన్నివేశాన్ని వారి వాట్సాప్‌ స్టేటస్‌గా పోస్ట్‌ చేయడం చూసి తాను బాధపడడం మాత్రమే కాదు నిజంగా భయపడుతున్నా కూడా అంటూ తానీ సన్నివేశం తీసినందుకు ఇప్పుడు క్షమాపణలు అన్నాడాయన. .

అదే విధంగా. ‘‘సేతుపతిలో, ఓ పిల్లవాడు తుపాకీని పట్టుకోవడం  రమ్య పాత్ర అకస్మాత్తుగా దాన్ని లాక్కునే మరో సన్నివేశం ఉంది. పిల్లవాడికి ఆయుధం ఇవ్వకూడదని తెలిసినా అలా చేయడం తప్పే’’అన్నారాయన. విజయ్‌ సేతుపతి  ఐశ్వర్య రాజేష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన పన్నైయరుమ్‌ పద్మినియుమ్‌ (2014)తో  చిత్ర రంగ ప్రవేశం చేసిన తర్వాత,  అరుణ్‌ కుమార్‌ మరో నాలుగు చిత్రాలకు నాయకత్వం వహించాడు, వీటిలో ఎక్కువ విమర్శకుల ప్రశంసలు అందుకున్నవే. ఏదేమైనా విజయవంతమైన తన చిత్రంలోని లోపాల్ని తానే చెబుతూ వాటిని పునరావృతం కానివ్వనని అంటున్న తమిళ దర్శకుడు అరుణ్‌ కుమార్‌ వైఖరి నిజంగా మెచ్చదగింది. 

ఒక హిట్‌ చిత్రాల దర్శకుడు సినిమా విజయవంతం అయిందని సరిపెట్టుకోకుండా తన సినిమా గురించి తాను నిజాయితీగా సమీక్షించుకోవడం సామాజిక బాధ్యత పట్ల తన వంతు పాత్ర పోషిస్తూ క్షమాపణలు అడగడం.. హింస, సెక్స్, వయోలెన్స్‌చుట్టూనే పరిభ్రమిస్తూన్న సినిమాల్ని చూసి విరక్తికి గురవుతున్నవారికి ఊరట అనే చెప్పాలి... చుట్టూ కమ్ముకున్న చీకటిలో కానవస్తున్న వెలుగురేఖ లాంటిదే అని చెప్పాలి.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)