Breaking News

ఆ సీన్‌ తర్వాత గతం మర్చిపోయిన అమ్రిష్‌ పురి..

Published on Sat, 06/28/2025 - 13:34

హీరోయిన్‌ కాజోల్‌కు మతిమరుపు ఉండేది. కుచ్‌కుచ్‌ హోతా హై సినిమా సెట్‌లో పదేపదే అన్నింటినీ మర్చిపోయేది. ఓసారి తనే ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే లెజెండరీ నటుడు అమ్రిష్‌ పురి (Amrish Puri) ఒకానొక సందర్భంలో తనెవరన్నది కూడా మర్చిపోయాడని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో కాజోల్‌ మాట్లాడుతూ.. అజయ్‌ దేవ్‌గణ్‌, అమ్రిష్‌ పురి ఓ సినిమాలో కలిసి నటించారు. 

అంతా మర్చిపోయిన అమ్రీష్‌పురి
అందులో అమ్రీష్‌.. జలపాతం కింద నిల్చునే సీన్‌ ఉంది. అందుకోసం ఆయన వాటర్‌ఫాల్‌ కింద నిలబడ్డారు. పైనుంచి ఎంతో వేగంగా వస్తున్న నీళ్లు ఆయన తలను కొట్టుకుంటూ కిందపడేవి. తలకు రక్షణగా ఏదీ పెట్టలేదు. సన్నివేశం అయిపోగానే ఆయన వాటర్‌ఫాల్‌ నుంచి వచ్చేశారు. కానీ అన్నీ మర్చిపోయాడు. అసలేదీ గుర్తులేదు. నేనెవర్ని? నేనిక్కడేం చేస్తున్నాను? అని ప్రశ్నించాడు. సెట్‌లో ఉన్నవాళ్లందరికీ భయంతో చెమటలు పట్టాయి. తనకు జ్ఞాపకశక్తి రావడానికి మూడు గంటలు పట్టింది. 

కరడుగట్టిన విలన్‌గా..
ఇప్పుడు తల్చుకుంటే సరదాగా అనిపిస్తుందేమోకానీ ఆ సమయంలో మాత్రం అందరూ చాలా భయపడ్డారు అని చెప్పుకొచ్చింది. అమ్రీష్‌ పురి, అజయ్‌ దేవ్‌గణ్‌.. టార్జాన్‌: ద వండర్‌ కార్‌, ఫూల్‌ ఔర్‌ కాంటే, హల్‌చల్‌, గెయిర్‌ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. హిందీలో వందలాది సినిమాలు చేసిన అమ్రిష్‌ పురి.. ఆదిత్య 369, బాబా, జగదేక వీరుడు అతిలోక సుందరి, మేజర్‌ చంద్రకాంత్‌, నిప్పురవ్వ వంటి పలు చిత్రాల్లో నటించారు. కరడుగట్టిన విలన్‌గా ప్రేక్షకులను తన ఆహార్యంతోనే భయపెట్టేవారు. 2005లో బ్లడ్‌ క్యాన్సర్‌తో కన్నుమూశారు.

చదవండి: కన్నప్పలో ప్రభాస్‌ పెళ్లి టాపిక్‌.. రచ్చ లేపిన ఫ్యాన్స్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)