Breaking News

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. 40 ఏళ్ల హీరోతో..

Published on Sun, 07/06/2025 - 17:37

రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ మూవీ దురంధర్‌ (Dhurandhar Movie). సంజయ్‌ దత్‌, ఆర్‌.మాధవన్‌, అర్జున్‌ రాంపాల్‌, అక్షయ్‌ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. నేడు (జూలై 6) రణ్‌వీర్‌ బర్త్‌డే సందర్భంగా దురంధర్‌ మూవీ టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో హీరో మాస్‌ అవతార్‌లో కనిపించాడు. అలాగే ఓ హీరోయిన్‌ను ఎత్తుకుని తిప్పుతూ కనిపించాడు.

చైల్డ్‌ ఆర్టిస్ట్‌ నుంచి హీరోయిన్‌గా..
ఆ హీరోయిన్‌ మరెవరో కాదు.. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ సారా అర్జున్‌. ప్రముఖ నటుడు రాజ్‌ అర్జున్‌ కూతురే సారా. సౌత్‌లో బాలనటిగా ఎన్నో సినిమాలు చేసిన ఆమె.. దురంధర్‌తో హీరోయిన్‌గా వెండితెరపై ఎంట్రీ ఇస్తోంది. ఈమె తెలుగులో దాగుడుమూత దండాకోర్‌ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ మనవరాలిగా నటించింది. నాన్న మూవీలో విక్రమ్‌ కూతురిగా మెప్పించింది. తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. పొన్నియన్‌ సెల్వన్‌ మూవీలో ఐశ్వర్యరాయ్‌ చిన్ననాటి పాత్రలో మెరిసింది. 

20 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌
చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా బోలెడంత పాపులారిటీ సంపాదించిన సారా.. అప్పుడే హీరోయిన్‌గా మారడంతో సినీప్రియులు ఆశ్చర్యపోతున్నారు. అందులోనూ 40 ఏళ్ల రణ్‌వీర్‌తో 20 ఏళ్ల సారా కలిసి నటించడంపై అప్పుడే చర్చ మొదలైంది. వీళ్లిద్దరూ జంటగా నటించారా? లేదంటే ఏదైనా మిషన్‌ కోసం ఇలా కలిశారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్‌ 5న విడుదల కానుంది. అదే రోజు ప్రభాస్‌ ది రాజాసాబ్‌ మూవీ రిలీజ్‌ అవుతుండటం గమనార్హం.

 

చదవండి: కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ను చూసి మన తెలుగు హీరోలు నేర్చుకోవాలి

Videos

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు